Connect with us

లోకల్ వార్తలు

ఆరు గ్యారెంటీల అమలుకు అధికారులు, సంపూర్ణంగా సహకరించాలి :CM Revanth Reddy

Published

on

న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్లు, సీపీ, ఎస్.పి లతో సమావేశం నిర్వహించారు. (CM Revanth Reddy)

కొత్త ప్రభుత్వం తరపున మీకందరికి స్వాగతం పలుకుతున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
డా”బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ప్రధానంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే.. అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలి అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం వుంటుందని రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు.(IAS, IPS Meeting With CM Revanth Reddy)

ఇందులో ఏది కూడా కాస్త వెనుకా ముందు చేసినా సరైన పనులు చేయకపోయినా.. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో ఇచ్చిన గారంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్లది, పోలీస్ అధికారులదే అని రేవంత్ రెడ్డి అన్నారు.(Congress 6 Guarantees scheme)

పత్యక్షంగా ప్రజలతో సంబంధాలు వుండాల్సినవాళ్లు, వుండే వాళ్లు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అందుకే ఈ రెండు ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలని ఆలోచనతో, ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగిందని, అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.. అద్దాల మేడలు కట్టో.. రంగుల గోడలు చూపించో.. అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు, అంటూ డా|| బిఆర్ అంబెడ్కర్ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.


నిజమైన అభివృద్ధి అనేది పౌరులయొక్క సమగ్రాభివృద్ధి జరిగినప్పుడే… చివరి వరుసలో వున్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని, అందుకే ఈరోజు చివరి వరుసలో నిలబడ్డ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వుండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలని,చేరాలంటే చేరవేయవలసిన వారధి మీరే అని, మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయో ఆరు గ్యారంటీలను దానికి సంబంధించి వినతిపత్రాలను, అప్లికేషన్లను తీసుకోవాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అఖిల భారత సర్వీసెస్ అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ, మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్.ఆర్. శంకర్ గారు వారు జీవితకాలం సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతీ పైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారని, అతను అఖిల భారత సర్వీసెస్ అధికారులకు ఒక ఆదర్శప్రాయమైన అధికారిగా నిలబడ్డవాడని,ఎస్.ఆర్. శంకరన్‌ గారు. వీరు ప్రతిరోజు ఉదయం విధులకు ముందు ఎస్ఆర్ శంకర్ ను గుర్తు తెచ్చుకుంటే తప్పకుండా మన విధానంలో మార్పు వస్తుందని సీఎం అన్నారు.
ప్రజలకు అది ఉపయోపడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా వారు సున్నితంగా తిరస్కరించారు. సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతం, ఇలాంటివి నేను ఆశించను. నేను నా బాధ్యత నెరువేరుస్తానని ఎస్.ఆర్. శంకరన్‌ గారు వినయంగా, వినమ్రతతో కేంద్ర ప్రభుత్వ పద్మభూషన్ అవార్డు తిరస్కరించడం ద్వారా వారు గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయారని సీఎం గుర్తుచేశారు.

ఈరోజు ఇక్కడ వున్న మా ఉన్నతాధికారులకు, మా జిల్లా కలెక్టర్లకు, మా ఎస్పీలకు, అడీషినల్ కలెక్టర్లకు, ఈ ప్రస్తుత ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్, అని మీరు ప్రజలచేత శభాష్ అనిపించుకున్నంతవరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా వుంటుందని, మీ పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా.. లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుందని, అదే విధంగా మనం చాలా సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనలను ఆకర్షిస్తాయి. కొంతకాలం పనిచేసిన అధికారులు వారు బదిలీ అయినప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అఖిల భారత సర్వీసులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కొరుకుని వచ్చిండ్రు. కనీసం 35 సంవత్సరాల సర్వీసు చేయగలరని,ఈ రాష్ట్రంలో పౌరుల్లో భాగంగా మీరు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చిండ్రని, మాది ఏదో రాష్ట్రమనో, భాష వేరే అని మీరెవరు భావించవలసిన అవసరం లేదని,మేము ఎవరమూ కూడా మిమ్మల్ని ఆ రకంగా నియంత్రించే విధంగా చూడడం లేదని,భాషను తెలుసువాలని,ప్రజల మనసులను గెలుచుకోవాలని, ప్రజల మనసులు మీరు గెలిచి విశ్వాసంతో నమ్మకంతో పనిచేయలని సీఎం కోరారు.


జవాబుదారితనంతో వ్యవహరించాలని,కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా వచ్చి ఆ అధికారులను సన్మానించడం, కన్నీళ్లు పెట్టుకోవడం మీరు చూసే వుంటారు. మీ సూదూరమైన ప్రయాణంలో ఎక్కడైనా, ఏ జిల్లాలో పనిచేసినా.. అది మీ బాధ్యత అనుకోండి.. మీరు చాలా బాగా పనిచేయాలని,అలాంటి వారికి ప్రభుత్వం సహాయ సహకారాలందిస్తుందని సీయం రేవంత్ రెడ్డి అన్నారు.
అధికారుల్లో మానవీయ కోణం ఉండాలని, చట్టాలను అమలు చేసేటప్పుడు మానవీయ కోణమున్నప్పుడు తొంబై తొమ్మిది శాతం పేద ప్రజలు తీసుకువచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం వుంటుందని సీఎం అన్నారు.

మానవీయ కోణంతో ప్రజలు లెవనెత్తిన అంశాలను అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపించలేమని,రూల్స్ ను మేము అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది.

మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యలను పరిష్కంచడానికే.. మన దగ్గరికి వచ్చినవారి సమస్యలు పరిష్కరించడానికే మనం వున్నామని,మేమైనా మీరైనా.. మన దగ్గరికి వచ్చినవారి సమస్యలు ఎలా పరిష్కరించాలో పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని, పాజిటివ్ అప్రోచ్ వుండాలని, నెగెటివ్ అప్రోచ్ తో మన దగ్గరికి ఏ కాగితం వచ్చినా ఎట్లా తిరస్కరించాలే అనే ఆలోచనతో మనం ముందుకువెళితే ఈ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ సరైన దిశగా ప్రయాణం చేయదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు గత 20 సంవత్సరాలనుండి ఇక్కడి ప్రజలతో మమేకమై వున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు వివిధ కారణాలు, ప్రత్యేకమైన రాజకీయవసరాలతో కానీ ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరుగలేదు. కోట్లాదిమంది ప్రజలు కోరుకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమబాట పట్టిండ్రు. వందలాది మంది అమరులై నేలకొరిగితే ఈ రాష్ట్రం ఏర్పడింది. ఎంతో బలమైన ఆకాంక్ష వుంటే తప్ప ఎవరూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టుకుని తమ రాష్ట్రాన్ని సాధించుకోరు. ఈ దేశంలో వుండే మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకత వున్నది. ఇక్కడి డిఎన్ఎ దేన్నైనా సహిస్తుంది కానీ, స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతోటి, సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతోటి సమానమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడి ప్రజలయొక్క రియాక్షన్ చాలా వైల్డ్ గా వుంటుందని,వాళ్లు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్ హెసివ్ గా, చాలా గౌరవంగా, మర్యాదగా ఏ విధంగా వ్యవహరిస్తారో మీరందరూ చూసిండ్రు. అదే సమయంలో మనం ఇచ్చి పుచుకునే ధోరణిలో వాళ్లు వాళ్లు ఏమి ఆలోచన చేస్తుండ్రో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలల్లో ఒకరకమైన చైతన్యం వుంది. ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేటువంటి శక్తి ఈ ప్రాంతం ప్రజలకు వున్నదని, మీరు ప్రజల్లోకి వెళ్లేట్పప్పుడు, కలిసేటప్పుడు ఈ ప్రత్యేకమైన రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోని వుండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

ప్రజలయొక్క ఆలోచన ఎట్లుంటది అన్న దానికి గుర్తు చేయదలుచుకున్నా కాబట్టి మేము జవాబుదారీతనంగా, బాధ్యతాయుతంగా ప్రజలకు అందుబాటులో వుండి ప్రజల సమస్యల పరిష్కరించడంలో పేరుకుపోయిన సమస్యలను ఆ చిక్కుముడులను విప్పడం ద్వారా ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తీసుకువచ్చి ఈ పాలన ప్రజలదని,ఈ ప్రజాపాలన, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం దిశగా ఈ నెల 28 నుంచి జనవరి 6, 2024 వరకు 8 పనిదినాలలో ఈ కార్యక్రమాలను తీసుకోవాలని, దీనికి సంపూర్ణమైన సహకారం మీవైపు నుంచి వుండాలని కలెక్టర్లందరికీ సీయం రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రజా ప్రతినిధులుగా మేము, ప్రభుత్వ పథకాలు ముందు తీసుకెళ్లే అధికారులుగా మీరు సమన్వయంతో ముందుకు వెళ్తామని సీయం రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ,ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, ఫైనాన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితెందర్, సీనియర్ ఐఎఎస్ అధికారులు నవీన్ మిట్టల్, దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, సయ్యద్ అలీ ముర్తుజా, కె. ఎస్. శ్రీనివాసరాజు, రాహుల్ బొజ్జా, క్రిష్టినాజడ్ చోంగ్తూ, రఘునందన్ రావు, రోనాల్డ్ రాస్, హరిచందన దాసరి, హనుమంతరావు, కె. అశోక్ రెడ్డి, వి. అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

లోకల్ వార్తలు

అమ్మ పరివార్ సంస్థకు తెలంగాణ సేవా రత్న అవార్డు

Published

on

న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు  మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను..
ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.

పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ..
తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love
Continue Reading

Viral న్యూస్

Shanmukh Jaswanth Arrest |గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.

మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.

బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)

ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.

షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు
వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.

ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..

Tags: Bigboss, Shanmukh Jashwanth, Youtube, drugs, arrest

Spread the love
Continue Reading

లోకల్ వార్తలు

మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులను చితకబాదిన టీచర్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)

ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.

Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students

Spread the love
Continue Reading