Connect with us

లోకల్ వార్తలు

ఈనాటి తెలంగాణలో ముఖ్యమైన వార్తలు

Published

on

1. కొత్తూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటన


న్యూస్ పల్స్ తెలుగు : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని కిచెన్ గార్డెన్ ని జిల్లా కలెక్టర్ ముజ్జమిల్ ఖాన్ శుక్రవారం రోజున సందర్శించారు. గార్డెన్లో జిల్లా కలెక్టర్ మొక్కని నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,పంచాయతీ సెక్రెటరీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

2.మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

న్యూస్ పల్స్ తెలుగు : జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం కిషన్ రావు పేట గ్రామానికి చెందిన మానాల మల్లయ్య అనే మతిస్థిమితం లేని వ్యక్తి సంకెనపల్లి గ్రామ స్మశాన వాటికలోని గదిలో అన్న పానీయాలు మానేసి మృతి చెందాడని ఎస్ఐ శ్వేత తెలిపారు. మృతుడి అన్న ప్రభుదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.

3.అసెంబ్లీ ఎన్నికల ఫిర్యాదులను తప్పకుండా తెలియజేయండివినీత సాహూ

న్యూస్ పల్స్ తెలుగు: రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినీత సాహు మాట్లాడుతూ..
పారదర్శక ఎన్నికల నిర్వహణకు, ప్రజలు నేరుగా ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదులు చేయాలని, వారి ఫోన్ నెంబర్లను తెలిపారు.
8121258834 అనే నెంబర్కు ప్రజలంతా ఫిర్యాదులు చేయవచ్చని ఆమె తెలిపారు.

4. ఒకే మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు

న్యూస్ పల్స్ తెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రెండు నియోజకవర్గాల పరిధిలో విస్తరించింది. రుద్రంగి మండల కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉండగా… మండలంలోని ఉమ్మడి మానాల గ్రామంలోని ఎనిమిది తండాల పంచాయతీలు నిజాంబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఈ మండలానికి వచ్చినప్పుడు ఏ నియోజకవర్గ ఓటర్లు ఎవరైనా విషయంపై గందరగోళం ఏర్పడుతుంది.

5.ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థులు ముగ్గురు గోదావరిఖని వాసులే

న్యూస్ పల్స్ తెలుగు : ధర్మపురి నియోజకవర్గ బరిలో పోటీ పడుతున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు గోదావరిఖని కి చెందిన వారే. గోదావరిఖని నుంచి ఇక్కడ పోటీ చేస్తూ తమ సత్తాని చాటుతున్నారు. ధర్మపురి నుంచి నాలుగు సార్లు విజయం సాధించి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి.ఆర్.ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీజేపీ అభ్యర్థి సూగల కుమార్ గోదావరిఖనికి చెందినవారే.

6.RFCLబాధితులను మోసం చేసింది కాంగ్రెస్ నాయకులే..

న్యూస్ పల్స్ తెలుగు : రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL)లో ఉద్యోగ బాధితుల మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నేతలే అని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిమ్మి బాబు అన్నారు. గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై లేనిపోని అబండాలు వేస్తున్నారని అన్నారు. సుభిక్ష పాలన ఉండాలంటే రాష్ట్రంలో కెసిఆర్ రామగుండంలో కోరుకంటి చందర్ గెలవాలని అన్నారు.

7.ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు న్యాయవిజ్ఞాన సదస్సు

న్యూస్ పల్స్ తెలుగు: పేదలకు ఉచిత న్యాయ సేవ సలహాలు అందించేందుకే కేంద్ర న్యాయ శాఖ ఏర్పాట్లు చేసిందని గోదావరిఖని జిల్లా 6వ అదనపు జడ్జి శ్రీనివాస్ రావు అన్నారు. ఈ మేరకు స్థానిక కోర్టు ఆవరణలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ,వికలాంగులు వృద్ధులు వితంతువులకు, తెల్ల రేషన్ కార్డుదారులకు, ఉచితంగా న్యాయ సలహాలు అందించే అవకాశం ఉందని అన్నారు.

8.పాఠశాలలో నాయకత్వ లక్షణాలపై అవగాహన

న్యూస్ పల్స్ తెలుగు : రామగుండం పట్టణ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు న్యాయకత్వ లక్షణాలపై అవగాహన కార్యక్రమాన్ని స్కూల్ HM అజ్మీర శారద నిర్వహించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని చదువుతోపాటు సామాజిక అంశాలపై దృష్టి సారించాలని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ఓటింగ్ విధానం సామాజిక సేవ కనీస సదుపాయాలు తదితర విషయాలపై ప్రాక్టికల్ గా చూపించారు.

9.వరుసగా మూడు రోజులు సెలవులు


న్యూస్ పల్స్ తెలుగు : దీపావళి సెలవులను ప్రభుత్వం సోమవారంకి మార్చడంతో ఉద్యోగులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు 12వ తేదీ సెలవు కాగా ఆ రోజు ఆదివారము అని సెలవు మార్చాలని విజ్ఞప్తులు ఎన్నో వచ్చాయి, తాజాగా సోమవారం సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి సెలవు కావడంతో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.
అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవే సెలవులుగా ప్రకటించనున్నారు.

10.జగిత్యాలలో 15 మహిళా పోలింగ్ కేంద్రాలు

న్యూస్ పల్స్ తెలుగు : జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో 15 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 మోడల్ పోలింగ్ కేంద్రాలు, యంగ్ పోలింగ్ కేంద్రాలు, ఇప్పుడు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జగిత్యాల కోరుట్ల ధర్మపురి నియోజకవర్గాల్లో ఒక్కో కేంద్రం వికలాంగులకు కేటాయించినట్లు తెలిపారు. కూడిన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

11.వికాస్ రావుకే బిజెపి బీఫారం.


న్యూస్ పల్స్ తెలుగు : బిజెపిలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. శుక్రవారం మరికొద్ది గంటలు నామినేషన్ ప్రక్రియ ముగిస్తున్న సమయంలో వేములవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు బీఫాంను బిజెపి పార్టీ అందజేసింది. దీంతో తనే బిజెపి అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ఆశించిన తుల ఉమకు ఆఖరి క్షణంలో వికాస్ రావుకు అందజేశారు.

Spread the love

లోకల్ వార్తలు

అమ్మ పరివార్ సంస్థకు తెలంగాణ సేవా రత్న అవార్డు

Published

on

న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు  మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను..
ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.

పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ..
తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love
Continue Reading

Viral న్యూస్

Shanmukh Jaswanth Arrest |గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.

మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.

బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)

ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.

షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు
వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.

ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..

Tags: Bigboss, Shanmukh Jashwanth, Youtube, drugs, arrest

Spread the love
Continue Reading

లోకల్ వార్తలు

మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులను చితకబాదిన టీచర్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)

ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.

Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students

Spread the love
Continue Reading