స్పెషల్ ఆర్టికల్స్
కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం..? ముఖ్యమైన రోజులివే..!
Published
2 years agoon

న్యూస్ పల్స్ తెలుగు: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం సహా కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులు ఇవ్వే …
ప్రతి ఏటా దీపావళి పండుగ మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది అందుకు బిన్నంగా వచ్చింది కార్తిక మాసం,ఈ సారి దీపావళి మర్నాడు కాకుండా దీపావళి తర్వాత రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న సందర్బంగా తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మమూహూర్తంలోనే,అందుకే నవంబరు 12 దీపావళి మర్నాడు నవంబరు 13 సోమవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది కనుక, అందుకే నవంబరు 14 మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవ్వుతుందన్న మాట.
- మంగళవారం నవంబరు 14 కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
- బుధవారం నవంబరు 15 యమవిదియ – భగినీహస్త భోజనం
- శుక్రవారం నవంబరు 17 నాగుల చవితి
- మొదటి సోమవారం నవంబరు 20 కార్తీకమాసం, కార్తావీర్యజయంతి
- నవంబరు 22 యాజ్ఞవల్క జయంతి
- నవంబరు 23 మతత్రయ ఏకాదశి
- శుక్రవారం నవంబరు 24 క్షీరాబ్ది ద్వాదశి
- ఆదివారం నవంబరు 26 జ్వాలా తోరణం
- సోమవారం నవంబరు 27 – కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ (Karthika Pournami 2023)
- మూడో సోమవారం డిసెంబరు 04 కార్తీకమాసం
- నాలుగో సోమవారం డిసెంబరు 11 కార్తీకమాసం
- బుధవారం డిసెంబరు 13 పోలి స్వర్గం

కార్తీకమాసం నెలరోజులూ అంత అత్యంత నియమనిష్టలతో ప్రజలు ఉంటారు. కార్తీమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. చలికాలం కాబట్టి చలిగాలులు పెరిగే సమయం ఈ నెలలో పేదలకు, అబగ్యులకు,నిస్సయులకు దానం చెయ్యడం, స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవవుల అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నది అందరు గుర్తుంచుకోవాలంటారు వేద పండితులు.
కార్తీకమాసంలో ఈ పనులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది..!
- ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసానికి దూరంగా ఉండాలి.
- కనీసం ఈ నెల రోజులు ఓ నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు,ఎదుటి వారికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి.
- విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి… దైవదూషణ మాత్రంఅస్సలు చేయకండి.
- దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు అస్సలు ఉపయోగించకండి.
- మినుములు తినకూడదు, నలుగుపెట్టుకుని స్నానం అస్సలు చేయకూడదు.
- కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట అస్సలు తినకూడదు.

కార్తీక మాసం మహా శివుడికి, శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం రోజున , జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణం లో కూడా ఈశ్వరుడి ప్రాముఖ్యతను మొదటి 15 అధ్యాయాలు, శ్రీహరి ప్రాధాన్యతను ఆఖరి 15 అధ్యాయాలు తెలియజేస్తాయి.
ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది తిరిగి డిసెంబరు 13 బుధవారం పోలిస్వర్గంతో కార్తీకమాసం ముగుస్తుంది.
You may like
Viral న్యూస్
Srirama Navami: శ్రీరామనవమి అస్సలు చరిత్ర ఇదే..
Published
4 months agoon
April 5, 2025
News Pulse Telugu: (Sri Ramanavami History)
శ్రీ రామనవమి చరిత్ర చాలా పురాతనమైనది, దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ శ్రీరామ నవమి. ఇది భగవాన్ శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిగా భావించబడుతుంది.చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిది తేదీన పున్నమి నక్షత్రం సమయంలో రాముడు జన్మించాడు.ప్రతియేట ఈ శ్రీరామ నవమిని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అస్సలు శ్రీ రామనవమి చరిత్ర…?
రాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్న కాలంలో,దశరథ మహారాజు కు సంతానం లేకపోవడంతో యాగాలు చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీమహావిష్ణువు నాలుగవ అవతారంగా రాముడిగా జన్మిస్తాడు.
దేవతలు రాక్షసుల అల్లర్ల వల్ల భూభారంగా వుండగా, విష్ణువును ప్రార్థించగా ఆయన రాముడిగా అవతరించాడని ఓ విశ్వాసం. రావణుని సంహారం కోసం ఈ అవతారం తీసుకున్నాడని పౌరాణిక విశ్వాసం.

శ్రీరామ నవమి పండుగ విధానం..?
శ్రీ రామ నవమి రోజు ఈ పండుగను పలుచోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు, కొన్నిచోట్ల రాముడి జన్మకథ వినడం, రామాయణ పారాయణం చేస్తారు. ఎక్కువ శాతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు(Sri Rama Kalyanam) అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రీరాముని కళ్యాణానికి భద్రాచలం చాలా ఫేమస్.
కొన్ని చోట్లల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు, కొన్ని చోట్ల పానకమ్,జాగ్రతితో చేసిన తేనె లేదా బెల్లం నీరు, వడపప్పు, పులిహోర శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కనుక ఆలయాల్లో జరిగే కళ్యాణానికి హాజరై భక్తులందరికీ, చల్లటి మజ్జిగ, బెల్లం పానకం అందజేస్తారు.
శ్రీరాముని కళ్యాణోత్సవం ముగించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు.

శ్రీరామనవమి ఉత్సవ సందేశం..
ఈ పండుగ ధర్మం, సత్యం,నిజాయితీ, శాంతి, మర్యాదకు,నైతికతలను నెమలే రోజు అని చెబుతారు. శ్రీరాముని జీవితం హిందూ ధర్మంలో ఆదర్శంగా భావిస్తారు. శ్రీరాముడు తన జీవితంలో చూపిన విలువలు నేటికి ప్రజలు వారి జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటారు.
ఈ శ్రీరామనవమి ఉత్సవం కేవలం పండుగ కాకుండా, తెలుగువారి సంస్కృతిని మానవ విలువలను గుర్తుచేసే అద్భుతమైన పండుగని భావిస్తారు.

Tags: Sriramanavami, SitaRamachandraswamy, JaiSriram, NewspulseTelugu

News Pulse Telugu : Alekhyaa Chitti Pickles, ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అవసరం లేదు, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఎన్నో వివాదాలతో పేరు జోరుగా వినిపిస్తుంది.
అయితే ఈ విషయాన్ని, ఆ వివాదాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం…
Alekhyaa Chitti Pickles ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు అక్క చెల్లెలు కలిసి నిర్వహిస్తున్నారు. వారు వివిధ రకాల పికిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు.
ఈ యొక్క వ్యాపారానికి ముందు ఈ ముగ్గురు అక్క చెల్లెలు, సోషల్ మీడియా వేదికగా, ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లలో పలు వీడియోలను చిత్రీకరిస్తూ, మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.
యొక్క సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫేమ్ ని, వారి యొక్క వ్యాపారాన్ని ఉపయోగించుకుంటూ పచ్చళ్ల విక్రయాన్ని కొనసాగించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

అయితే, కొందరు వినియోగదారులు వారి నాణ్యత మరియు ధరల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ ప్రకారం చూసుకున్న, మార్కెట్లో ఉన్న ధరలకు రెండింతలుగా వీరి యొక్క పికిల్స్ ధరలతో విక్రయస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
ఆ పికిల్స్ ని కొన్న వినియోగదారులు కూడా వారి యొక్క పికిల్స్ కు సంతృప్తి చెందడం లేదు, వారు నిర్ణయించిన ధరకు, పికిల్స్ రుచి, నాణ్యత అంతగా లేకపోవడం వినియోగదారులను తీవ్ర నిరాశకు తరచూ గురిచేస్తుందని చాలామంది వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా వారికి నేరుగా తెలుపుతున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్‌కు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా నడుస్తున్నాయి.

అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వివాదం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఆడియో క్లిప్‌ల చుట్టూ తిరుగుతోంది. ఈ క్లిప్‌లలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థకు చెందిన వ్యక్తి కస్టమర్లతో దురుసుగా, అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆడియోలో కస్టమర్‌లతో సంస్థ ప్రతినిధులు మాట్లాడినట్లుగా ఉన్న అనేక ఆడియో క్లిప్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటిలో కొందరు కస్టమర్‌లు ధరల గురించి లేదా ఇతర సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు దురుసుగా సమాధానం చెప్పిన ఆడియో క్లిప్పులు బయటపడి ఈ విషయం పెద్ద రచ్చగా మారింది.బూతు పదజాలంతో కొన్ని ఆడియో క్లిప్‌లలో సంస్థ ప్రతినిధులు కస్టమర్లను తిడుతూ, బూతులతో, కస్టమర్ యొక్క కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అనరాని మాటలు అనడంతో, ఈ విషయం నెట్టింట చర్చగా మారింది, ప్రస్తుతం ఈ విషయమే ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
ఈ ఆడియో క్లిప్‌లు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వివాదం మీమర్స్ అందరికీ ఒక మంచి కంటెంట్ గా మారింది, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఇదే ట్రెండింగ్ ఇష్యూగా మారింది.
చాలా మంది నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వ్యాపారం తాత్కాలికంగా ఆగిపోయినట్లే తెలుస్తుంది, వారి సంస్థ యొక్క వాట్సప్ అకౌంట్ డిలీట్ చేశారు.

ఈ విషయం పై తీవ్ర వివాదానికి దారితీస్తున్న సమయంలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థ యొక్క నిర్వహకులు క్షమాపణలు తెలుపుతూ ఒక వీడియోను వారి యొక్క వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది.
ఈ విషయంపై ఆ వీడియోలో నిర్వాహకులు మాట్లాడుతూ తొలుత తమను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని వాదించారు. అయితే, తరువాత అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వాహకులు అలేఖ్య స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి, తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పింది. ఆమె ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆ వీడియోలో కోరింది.
క్షమాపణ చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగలేదు. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరు ఇది కావాలని చేస్తున్న ప్రచారం అని కూడా అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం అనేది సంస్థ ప్రతినిధుల దురుసు ప్రవర్తన మరియు బూతు పదజాలం కారణంగా తలెత్తి, సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. క్షమాపణ చెప్పినప్పటికీ, ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.
Tags: #ChittiPickels #AlekhyaaChittipickels #Newspulsetelugu #viralnews #trending #Aptrending #Tstrending

News Pulse Telugu: Hyderbad Central University (HCU) లేదా University Of Hyderbad(UoH) దేశంలో పేరుగాంచిన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విశ్వవిద్యాలయం మరియు పరిశోధనలో ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థ.ఇది 1974లో 2300 ఎకరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరా గాంధీ సహకారంతో స్థాపించబడింది. ఇది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలికి సమీపంగా ఉంది.
అస్సలు ప్రస్తుతం HCU వివాదం ఏంటి..?
ప్రస్తుతం ఎక్కడ, ఏ మాధ్యమాల్లో చూసిన ఈ వివాదం ప్రధానంగా కనిపిస్తుంది.
విద్యార్థుల ధర్నాలు, ప్రొటెస్ట్ లు ఇవ్వే కనిపిస్తున్నాయి.
అస్సలు ఈ వివాదం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించినది. ఈ భూమి HCU(Hyderabad Central University) పరిధిలోకి వస్తుందని విశ్వవిద్యాలయం వాదిస్తుండగా, ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని, సర్వ హక్కులు ప్రభుత్వంకే ఉన్నాయని చెప్తూ, దీనిని అభివృద్ధి చేయాల నిప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం ఈ భూమిని వివిధ ప్రాజెక్టులకు కేటాయించాలని యోచిస్తోంది. అయితే, HCU విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

ఈ భూమిలో చెట్లను తొలగించడం, భూమిని చదును చేయడం వంటి పనులు చెయ్యడం నిలిపివేయాలని, ఈ HCU భూమిని ప్రభుత్వం విడిచి పెట్టాలని, మూగజీవలను ప్రకృతిని కాపాడాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
HCU కి సినీ సెలబ్రిటీల మద్దతు…!
ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరుగుతోంది.
ఈ వ్యవహారం పై సినీ సెలబ్రిటీలు రేణు దేశాయి, ఈశ రెబ్బ, రశ్మి గౌతమ్, ఇంకా ఇతరులు కూడా స్పందిస్తూ విద్యార్థులకు, పర్యావరణానికి మద్దతు తెలుపుతున్నారు.
HCU లో జరిగే తీవ్ర పరిణామలు ఇవ్వే...!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూములకు, హెచ్‌సీయూకు సంబంధంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
హెచ్‌సీయూ భూముల వివాదం రచ్చగా మారిన నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ వివాదంపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాయి.హెచ్‌సీయూ విద్యార్థినేతలు, నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక దశలో హెచ్‌సీయూ దగ్గర విద్యార్థుల పై పోలీసుల లాఠీచార్జి కూడా చోటుచేసుకుంది.

అయితే రాత్రికి రాత్రే.. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో సుమారు 50 కి పైగా జేసీబీలతో అధికారులు నిర్వీరమం గా HCU భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదం తెలంగాణలో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.
అయితే, కంచ గచ్చిబౌలి HCU భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. 400 ఎకరాల్లో చెట్లు నరికివేత చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
అదే సమయంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పందిస్తూ.. కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖ అధికారులను ఆదేశించింది.
కోర్టు తీర్పులకు లోబడే అధికారులు ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపింది.
నిజ నిర్ధారణ నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది తెలంగాణ హై కోర్ట్.
అసలు ప్రభుత్వం వాదన ఏంటి…?
ప్రభుత్వం HCU లోని 400 ఎకరాల ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని, యూనివర్సిటీకి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది.
HCU లోని ఈ భూమిని విక్రయం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి వాదన.
అయితే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారని లేపాయి. అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకరం చుట్టిన ఈ ప్రభుత్వానికి, అడ్డుకట్ట వేయాలని కొన్ని దుష్టశక్తులు, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, కొన్ని గుంట నక్కలు ఈ పనులు చేస్తున్నాయని అసెంబ్లీ వేదికగా ఆయన అన్నారు.
ఈ వాక్యాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్రదుమారని లేపాయి.
ఈ వివాదం పై విద్యార్థుల వాదన….
HCU భూముల విక్రయం పట్ల విద్యార్థులు, ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. విద్యార్థులు తమ హక్కులను రక్షించుకోవాలని, ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఈ వివాదం ఉధృతంగా కొనసాగుతోంది.
అయితే అభివృద్ధి పేరుతో పచ్చని ప్రకృతిని వన్యప్రాణులను నాశనం చేయొద్దని, హైదరాబాద్ కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ప్రకృతి హైదరాబాద్ గుండె కాయని, ఈ ప్రకృతి ద్వారా ఎంతోమంది మానవాళికి ప్రాణవాయుని అందిస్తుందని, వారు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను, కేవలం విద్యావ్యవస్థ కొరకై, యూనివర్సిటీ అభివృద్ధి కొరకి మాత్రమే ఉపయోగించాలని, వేరే ఇతర పనుల కోసం ఉపయోగించే హక్కు ఎవరికీ లేదని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే విద్య వ్యవస్థ అభివృద్ధి కొరకు ప్రభుత్వం పాటుపడితే, విద్యార్థులు ఎవరు అడ్డు చెప్పరని విద్యార్థులు అంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు తీవ్రంగా మోహరించారు, యూనివర్సిటీ కి సంబంధించిన అన్ని గేట్లను మూసివేసి, ప్రతి గేటు వద్ద పోలీసులు ఉన్నారు.
HCU వివాదం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే.

యువతిపై రైల్వేస్టేషన్ వద్ద కీచకుల అఘాయిత్యం…

Peddi: పెద్ది సినిమా కథ ఇదే….

Srirama Navami: శ్రీరామనవమి అస్సలు చరిత్ర ఇదే..

దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారు…?(Why is Ravana burnt on Dussehra..?)

ప్రియుడి మొజులో బర్తని హత్య చేసిన భార్య
