న్యూస్ పల్స్ తెలుగు ,హైదరాబాద్ : తెలంగాణ,హైదరాబాద్ లోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.
భార్య, భర్త, కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలోని మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు. ఈ ఘటన వారసిగూడా పోలీస్ స్టేషన్ లిమిట్స్ చోటుచేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మృతులు కర్నూలు జిల్లా లక్ష్మీపురం కి చెందిన కొప్పుల సాయికృష్ణ, భార్య చిత్రలేఖ, నాలుగేళ్ల కూతురు తేజస్వినితో కలిసి హైదరాబాద్ లోని ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివాసముంటున్నారు.
హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్ లో చిత్రలేఖ ఉద్యోగం చేస్తుండగా.. అక్కడే పనిచేస్తున్న గీతారావు,శ్యామ్ కొఠారిలు ఆమెను వేధింపులకు గురి చేశారు.. చిత్రలేఖపై ఆ ఇద్దరు తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురై డిప్రెషన్ లోకి వెళ్లింది చిత్రలేఖ. అయితే ఉద్యోగంలో వేధింపుల కారణంగానే కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ లేఖ రాసి ఉండటంతో ఇది సంచలనంగా మారింది.
మొదటిగా నాలుగేళ్ల కుమార్తె తేజస్వినికి ఉరివేసిన తర్వాత,భర్త సాయికృష్ణ, భార్య చిత్రలేఖ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మృతులు రాసిన సూసైడ్ లేఖ ఆధారంగా, పోలీసులు విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News Pulse Telugu,మేడ్చల్: ఆడపిల్లలకు ప్రస్తుతం ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు ఎన్ని ప్రత్యక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట తరుచు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ లిమిట్స్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు ఆ దుర్మార్గ కీచకులతో పోరాడింది.
ఇటీవలే జరిగిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి వారికీ బయపడకుండా వారికీ ప్రతిఘటించడంతో అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండుగా ఆమెను ఈ కీచకులు అడ్డుకున్నారు . ఆ యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా, అస్సలే అధైర్య పడకుండా వారితో ధైర్యంగా పోరాడింది. ఆ కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఆ యువతి. ఒక్కసారిగా దుండగులందరూ ఆ యువతి మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో యువతి దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ ఆ దుండగులు యువతి వెంటపడటంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని యువతి వెంటనే మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో దుండుగులు ఏ విధంగా తనను ఇబ్బందులకు గురిచేశారు.. తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరంగా వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును మేడ్చెల్ పోలీసులు, రైల్వే పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఆ రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు మార్లు ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దుండగులు గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని,గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు భద్రత పెంచాలంటూ పలు డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్‌లో జరిగిన ఘటనపై పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు ఈ కేసును బదిలీ చేయగా.. వారు కేసును విచారణ జరుపుతున్నారు.
కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో ఆ యువతికి కూడా కొంత మేరకు గాయాలు అవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
న్యూస్ పల్స్ తెలుగు,మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కల్మలాపేట గ్రామనికి చెందిన సల్పలా శ్రీనివాస్ కు బెల్లంపల్లి కోర్టు జడ్జి ముకేశ్ మూడు నెలల జెలు శిక్ష విధించినట్లు నీల్వయి ఏస్ఐ సుబ్బారావు తెలిపారు మూడు నెలల క్రితం కల్మలాపేటలో రాజేందర్ ఇంట్లో ఎవరూలేని సమయం లో దొంగతనం జరిగింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేసి సల్పలా శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు నేరం రుజువు కావడంతో జడ్జి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
న్యూస్ పల్స్ తెలుగు : చిన్న వయసులో ప్రేమ వివాహం అయ్యి, గర్భం దాల్చడంతో, రక్త హీనతతో యువతి మృతి చెందింది …అది తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సాయితరుణ్ (22) ఇదే గ్రామానికి చెందిన జ్యోతిక ఇరువురు ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో వారి తల్లిదండ్రులు,పెద్దలు అంగీకరించడకపోవడంతో వారిని ఎదురించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు ఈ ఇద్దరు దంపతులు.
కాగా జ్యోతిక గర్బిణి అయ్యి,నెల కిందట రక్తహీనత వ్యాదితో ఆసుపత్రిలో జ్యోతిక మృతి చెందింది.తీవ్ర మనస్థాపానికి గురైన భర్త సాయి తరుణ్ వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సాయి తరుణ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం సాయి తరుణ్ ని హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నస్పూర్ మున్సిపాలిటీకి పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన శెట్టిపల్లికి వారి తల్లిదండ్రులు బంధువులు తరలించారు.