న్యూస్ పల్స్ తెలుగు: (New Sim Card Rules) సిమ్ కార్డులకు సంబంధించి కేంద్రం మరిన్ని కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై సిమ్ కార్డులు కొనాలనుకునే వారు, సిమ్ కార్డు కొనే సమయంలో తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి నుండి పోలీసులు కూడా సిమ్ కార్డు కొనుగోలు దారుడి ఐడెంటిటీని నిర్ధారించాల్సి ఉంటుంది. టెలికాం సంస్థలు సదరు సిమ్ కార్డు విక్రయించే దుకాణాలకు వెళ్లి కేవైసీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఎవ్వరైనా అతిక్రమిస్తే 10లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. సిమ్ కార్డు విక్రయించే వారు నవంబరు 30లోపు వారు సిమ్ కార్డులులను విక్రాయించడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.