Connect with us

క్రైమ్ న్యూస్

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Published

on

  • 4.060 కేజీల గంజాయి స్వాధీనం

న్యూస్ పల్స్ తెలుగు: రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్. ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ ప్రాంతం లో నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది అనుమానస్పదంగా బైక్ లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులను ఆపి వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగ్ లలో 4.060 కేజీల డ్రై గంజాయి లభించింది. దీని విలువ సుమారు 80,200/- రూపాయలు ఉంటుందని తెలిపారు.


అనంతరం వారిని విచారించగ వారి పేర్లు గాజుల సిద్దార్థ, దాసరి వినోద్ మరియు MD ఇర్ఫాన్,సతికం శ్రీరామ్ వర్మ,Md. అజరుద్దీన్ గా తెలిపారు.

చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తాము తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో,

ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలోని అమాయకపు విద్యార్థులకు, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతామని వారు అన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులను వారి వద్ద లభించిన గంజాయిని స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించినట్లు తెలిపారు.

Spread the love

క్రైమ్ న్యూస్

దొంగతనం కేసులో మూడు నెలల జైలు శిక్ష

Published

on

న్యూస్ పల్స్ తెలుగు,మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కల్మలాపేట గ్రామనికి చెందిన సల్పలా శ్రీనివాస్ కు బెల్లంపల్లి కోర్టు జడ్జి ముకేశ్ మూడు నెలల జెలు శిక్ష విధించినట్లు నీల్వయి ఏస్ఐ సుబ్బారావు తెలిపారు మూడు నెలల క్రితం కల్మలాపేటలో రాజేందర్ ఇంట్లో ఎవరూలేని సమయం లో దొంగతనం జరిగింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేసి సల్పలా శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు నేరం రుజువు కావడంతో జడ్జి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

Spread the love
Continue Reading

క్రైమ్ న్యూస్

ప్రేమించిన పెళ్ళాడిన సఖిని కోల్పోయి యువకుడి ఆత్మహత్య

Published

on

న్యూస్ పల్స్ తెలుగు : చిన్న వయసులో ప్రేమ వివాహం అయ్యి, గర్భం దాల్చడంతో, రక్త హీనతతో యువతి మృతి చెందింది …అది తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సాయితరుణ్ (22) ఇదే గ్రామానికి చెందిన జ్యోతిక ఇరువురు ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో వారి తల్లిదండ్రులు,పెద్దలు అంగీకరించడకపోవడంతో వారిని ఎదురించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు ఈ ఇద్దరు దంపతులు.

కాగా జ్యోతిక గర్బిణి అయ్యి,నెల కిందట రక్తహీనత వ్యాదితో ఆసుపత్రిలో జ్యోతిక మృతి చెందింది.తీవ్ర మనస్థాపానికి గురైన భర్త సాయి తరుణ్ వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు సాయి తరుణ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం సాయి తరుణ్ ని హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నస్పూర్ మున్సిపాలిటీకి పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన శెట్టిపల్లికి వారి తల్లిదండ్రులు బంధువులు తరలించారు.

Spread the love
Continue Reading

క్రైమ్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి

Published

on

న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖనిలోని 2ఇంక్లైన్ మోరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.(Singareni)
మృతుడు గోదావరిఖని విట్టల్ నగర్ కు చెందిన కౌటం సంపత్ 11 ఇంక్లైన్ బాయి కార్మికుడిగా కార్మికుడుగా గుర్తింపు.
కాగా కార్మికుడు నైట్ డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పక్క నుంచి వెళ్తున్న బొగ్గు లారీలో ఉన్న ఓ భారీ బొగ్గు పెళ్ల, సంపత్ తలపై పడడంతో, కింద పడిపోయిన సంపత్, ఆయన తలపై నుండి గుర్తు తెలియని వాహనం యొక్క టైర్లు వెళ్లడంతో, సంపత్ అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్టు సమాచారం.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.

కాగఈరోజు ఉదయం 11 ఇంక్లైన్ గని కార్మికులు,11 ఇంక్లైన్ గని ముందు బయటయించి నిరసన తెలిపారు.
నూతనంగా ప్రారంభించిన రోడ్డు తమను మృత్యువాత పట్టిస్తుందని,
తమకు రోడ్డును పునరుద్ధరణ చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలని సింగరేణి అధికారులను, డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
కార్మికులు చేసే ఈ నిరసనకు కార్మిక సంఘ నాయకులు కూడా మద్దతుగా గని వద్దకు చేరుకున్నారు.
అధికారుల వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.

Spread the love
Continue Reading