న్యూస్ పల్స్ తెలుగు రామగుండం : స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగుతున్న సోమారపు ఈ రోజు 25 వ డివిజన్ చంద్రబాబు కాలనీ,కెసిఆర్ కాలనీ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.CPI నాయకులు ఆమని శివప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పైగా సోమారపు సత్యనారాయణ కి మద్దతు తెలిపేరు, వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సారి తిరిగి MLA గా గెలిపంచుకుంటామని ఎవరు ఎన్ని ప్రలోబలకు గురిచేసిన అందరం ఏకతాటిగా నిలబడి అభివృద్దే ద్యేయంగా పనిచేసిన ఆయనను భారీ మెజార్టీతో తిరిగి అసెంబ్లీకి పంపివ్వాలని అయన ప్రజలను కోరారు.
ఎలక్షన్ లో గెలవడానికి డబ్బు సంచులతో,ప్రత్యర్థులు తయారుగా ఉన్నారని, ఓట్ కి నోట్ తో కొని తిరిగి గెలుపొంది రామగుండము ని అవినీతి మయంగా తయారుచేస్తారని,ఇలాంటి నాయకులకు తగిన బుద్ది చెప్పాలని కోరారు, నీతి నిజాయతి ,అభివృద్ధి కే పట్టం కట్టాలని మీ ఓట్ ద్వారా తెలియపర్చలాని అన్నారు,ఈ సారి తిరిగి MLA గా మీ అందరి దీవెనలతో గెలుపొందించి రామగుండాన్ని తెలంగాణాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి తీర్చి దిద్దెల ఆశీర్వధించాలని సోమరాపు సత్యనారాయణ అన్నారు.
(Somarapu sathyanarayana ramagundam )
ఇంకా ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ,రవి, కృష్ణ,బిక్షపతి,బండారి రాయమల్లు, వీరన్న,దీటి వెంకటస్వామి,చంద్రశేఖర్ గౌడ్, కిషన్ రావు,సురేష్ పటేలుసత్యం,రాయాలింగు డేవిడ్, సురేష్,తాజు,అరవింద్,కృప,సాగర్, సూరి,కిషోర్,కృప,శ్యామ్ రాజ్ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students