Connect with us

లోకల్ వార్తలు

తిరుపతిలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

Published

on

న్యూస్ పల్స్ తెలుగు ,తిరుమల:  తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెర‌చి ఉంచి భ‌క్తుల‌కు దర్శనం  కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.(Tirupathi Devasthanam, TTD)

 పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనంకి   నతో గొప్ప  విశిష్టత ఉంది.

వైకుంఠ ద్వార దర్శన విశిష్టత…

పురాణాల ప్రకారం  వైకుంఠంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం  అని అర్థం.

 వైకుంఠంలో తెల్లవారుజామున  120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తారు తెల్లవారు జమున  బ్రహ్మ  ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు దశ్ర్షణం ఇస్తారు .ఈ  ప్రక్రియ వైకుంఠంలో కాలమానం ప్రకారం ప్రతిరోజు జరుగుతుంది. భూలోకం కాలమానం ఈ ప్రక్రియ  సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది.

ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి  వైష్ణవ  ఆలయాల్లో  ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం  చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది నమ్మకం.

వైకుంఠ ద్వార దర్శనం కోసం అచ్చే భక్తులు ఇవ్వి గమనించండి …

ఈ 10 రోజుల‌లో  వైకుంఠ ద్వార దర్శనం  ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ స‌మాన‌మే.  భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి దర్శనం చేసుకోవాలని టీటీడీ కోరింది.

 తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ పవిత్ర రోజుల్లో  భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు పొందాల్సిందిగా భ‌క్తులకు టీటీడీ బక్తులకు విజ్ఞప్తి చేసింది .

 గ‌తంలో వ‌లెనే ఈ సంవత్సరం  కూడా స్వయంగా  వ‌చ్చే ప్రోటోకాల్ విఐపిల‌కు ప‌రిమితంగా మాత్రమే  బ్రేక్ దర్శనం  ఇవ్వ‌బ‌డుతుందని,ఎలాంటి  సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతిలో జరిగే  10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం, పదిరోజుల్లో ఏ రోజైన ఉంటుందని,ఏ రోజు దర్శనం చేసుకున్న ఫలితం సమానమే  కావున విఐపిలు, ఇత‌ర భ‌క్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాద‌శి రోజు మాత్రమే  దర్శనం  చేసుకోవాల‌నే తొంద‌ర‌పాటు లేకుండా ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు దర్శనం  చేసుకోవ‌డానికి ప్రణాళికలు  రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.

Spread the love

లోకల్ వార్తలు

అమ్మ పరివార్ సంస్థకు తెలంగాణ సేవా రత్న అవార్డు

Published

on

న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు  మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను..
ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.

పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ..
తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love
Continue Reading

Viral న్యూస్

Shanmukh Jaswanth Arrest |గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.

మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.

బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)

ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.

షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు
వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.

ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..

Tags: Bigboss, Shanmukh Jashwanth, Youtube, drugs, arrest

Spread the love
Continue Reading

లోకల్ వార్తలు

మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులను చితకబాదిన టీచర్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)

ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.

Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students

Spread the love
Continue Reading