న్యూస్పల్స్తెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రక్త చరిత్రను సృష్టించే ప్రయత్నం చేస్తుందని రామగుండం శాసనసభ్యులు, ప్రస్తుత Brs పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. పచ్చదనంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ అని అభ్యర్థులను హత్య చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనే కిరాతక విధానాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపుతోందని కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం సాయంత్రం గోదావరిఖనిలోని బీ.ఆర్.ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. 14 ఏళ్ల పాటు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్, ఏనాడు అహింసకు తావివ్వలేదని, గడిచిన 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మతకలహాలు, రాజకీయ హత్యలు లేకుండా పరిపాలన కొనసాగించారని చెప్పారు. ప్రజల్లో బీ.ఆర్.ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి, ఓటమి భయంతో కాంగ్రెస్ హింసాత్మక ఘటనలకు తెగబడుతున్నట్లు ఆరోపించారు. రామగుండంలో కూడా, ఒకప్పటి గుండాల రాజ్యం గుర్తుకు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా నూతన వ్యాపారాలు పెట్టుకోవాలంటే,హాఫ్తాలు ఇచ్చే పరిస్థితులు దర్శనమిస్తున్నాయని సూచించారు. తెలంగాణలో రక్త చరిత్రను సృష్టించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ఒకవైపు నిలిస్తే / పచ్చదనంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కేసీఆర్ మరోవైపు నిలిచారని చెప్పారు. ప్రజాస్వామ్యానికి, ప్రశాంతతకు గొడ్డలి పెట్టు లాంటి హింస రాజకీయాలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తానిపర్తి గోపాలరావు, మాదాసు రామ్మూర్తి, తోడేటి శంకర్ గౌడ్, నడిపల్లి మురళీధర్ రావు, నూతి తిరుపతి,చిలకలపల్లి శ్రీనివాస్ మండ రమేష్, చిప్ప రాజేష్,వంగ శ్రీనివాస్ గౌడ్, జక్కుల తిరుపతి,మేడి సదయ్య అనుముల కళావతి,అడ్లూరి. రాములు, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students