స్పెషల్ ఆర్టికల్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలంతా ఎవరో తెలుసుకోండి..!
Published
11 months agoon
న్యూస్ పల్స్ తెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలంతా వీరే.. ఎవ్వరు ఏ నియోజకవర్గంలో తెలుసుకుందమా …!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది.అనుకోని ఉహించని రీతిలోBRS పార్టీని చిత్తూ చిత్తుగా ఓడించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన కాంగ్రెస్ గెలుపు ప్రయాణం .. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం ఢంకా మోగించుకుంటూ కొనసాగింది కాంగ్రెస్ పార్టీ.
119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోటిలో కాంగ్రెస్ పార్టీ 60 పై చిలుకు స్థానాల్లో విజయం సాధించి, మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను ఇప్పటికే కాంగ్రస్ గెలుచుకొని ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే విదంగా అడుగులు వేస్తుంది..
తెలంగాణ భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రావ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తొలి ఎమ్మెల్యే సీటు ఇదే. గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శించినప్పటికీ.. మిగతా జిల్లాల్లో మాత్రం హస్తం పార్టీ తన సత్తా చాటింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మె్ల్యే కేపీ వివేకానంద్ గౌడ్ అత్యధికంగా 85 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు .
ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలిచారో తెల్సుకుందాం ….! ( 2023 Telangana MLA”S List )
S.No . నియోజకవర్గం విజేత/ ఆధిక్యం పార్టీ
- సిర్పూర్,పాల్వాయి హరీష్ బాబు -బీజేపీ
- చెన్నూరు, గడ్డం వివేకానంద్- కాంగ్రెస్
- బెల్లంపల్లి, గడ్డం వినోద్ -కాంగ్రెస్
- మంచిర్యాల, కొక్కిరాల -ప్రేమ్ సాగర్ రావు(కాంగ్రెస్
- ఆసిఫాబాద్, కోవా లక్ష్మీ -బీజేపీ
- ఖానాపూర్, వెడ్మ భొజ్జు -కాంగ్రెస్
- ఆదిలాబాద్, పాయల్ శంకర్- బీజేపీ
- బోథ్ అనిల్, జాదవ్- బీఆర్ఎస్
- నిర్మల్,మహేశ్వర్ రెడ్డి -బీజేపీ
- ముథోల్, రామారావు పవార్ -బీజేపీ
- ఆర్మూర్, రాకేష్ రెడ్డి -బీజేపీ
- బోధన్,పి.సుదర్శన్ రెడ్డి -కాంగ్రెస్
- జుక్కల్, తోట లక్ష్మీకాంతరావు -కాంగ్రెస్
- బాన్సువాడ, పోచారం శ్రీనివాస రెడ్డి -బీఆర్ఎస్
- ఎల్లారెడ్డి, కె. మదన్ మోహన్ రావు -కాంగ్రెస్
- కామారెడ్డి,వెంకట రమణా రెడ్డి -కాంగ్రెస్
- నిజామాబాద్,అర్బన్ సూర్యనారాయణ -బీజేపీ
- నిజామాబాద్,రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి -కాంగ్రెస్
- బాల్కొండ, వేముల ప్రశాంత్ రెడ్డి -బీఆర్ఎస్
- కోరట్ల, కల్వకుంట్ల సంజయ్ -బీఆర్ఎస్
- జగిత్యాల, టి. జీవన్ రెడ్డి -కాంగ్రెస్
- ధర్మపురి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్- కాంగ్రెస్
- రామగుండం, మక్కన్ సింగ్ రాజ్ థాకూర్ -కాంగ్రెస్
- మంథని, దుద్దిళ్ల శ్రీధర్ బాబు -కాంగ్రెస్
- పెద్దపల్లి, చింతకుంట్ల వినయ రమణ రావు -కాంగ్రెస్
- కరీంనగర్, గంగుల కమలాకర్ -బీఆర్ఎస్
- చొప్పదండి, మేడిపల్లి సత్యం -కాంగ్రెస్
- వేములవాడ, ఆది శ్రీనివాస్ -కాంగ్రెస్
- సిరిసిల్ల, కేటీ రామారావు -బీఆర్ఎస్
- మానకొండూరు కె.సత్యనారాయణ -కాంగ్రెస్
- హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి -బీఆర్ఎస్
- హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ -కాంగ్రెస్
- సిద్ధిపేట టి. హరీశ్ రావు -బీఆర్ఎస్
- మెదక్ మైనంపల్లి రోహిత్ రావు -కాంగ్రెస్
- నారాయణ్‌ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి -కాంగ్రెస్
- ఆందోల్ దామోదర రాజనర్సింహ -బీఆర్ఎస్
- నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి -బీఆర్ఎస్
- జహీరాబాద్ కె.మాణిక్ రావు -బీఆర్ఎస్
- సంగారెడ్డి చింతా ప్రభాకర్ -బీఆర్ఎస్
- పటాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి -బీఆర్ఎస్
- దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి -బీఆర్ఎస్
- గజ్వేల్ కేసీఆర్ -బీఆర్ఎస్
- మేడ్చల్ చామకూర మల్లారెడ్డి -బీఆర్ఎస్
- మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి -బీఆర్ఎస్
- కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద్ -బీఆర్ఎస్
- కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు -బీఆర్ఎస్
- ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి -బీఆర్ఎస్
- ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి- కాంగ్రెస్
- ఎల్బీ నగర్ డి.సుధీర్ రెడ్డి- బీఆర్ఎస్
- మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి -బీఆర్ఎస్
- రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్ -బీఆర్ఎస్
- శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ -బీఆర్ఎస్
- చేవెళ్ల కాలె యాదయ్య -బీఆర్ఎస్
- పరిగి తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి -కాంగ్రెస్
- వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ -కాంగ్రెస్
- తాండూరు బి.మనోహర్ రెడ్డి -కాంగ్రెస్
- ముషీరాబాద్ ముఠా గోపాల్ -బీఆర్ఎస్
- మలక్ పేట్ హ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా -ఎంఐఎం
- అంబర్‌పేట కాలేరు వెంకటేశ్ -బీఆర్ఎస్
- ఖైరతాబాద్ దానం నాగేందర్ -బీఆర్ఎస్
- జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ -బీఆర్ఎస్
- సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ -బీఆర్ఎస్
- నాంపల్లి మహ్మద్ మజీద్ హుస్సేన్ -ఎంఐఎం
- కార్వాన్ అమర్ సింగ్ -బీజేపీ
- గోషా మహల్ రాజాసింగ్ -బీజేపీ
- చార్మినార్ మిర్ జుల్ఫికర్ అలీ -ఎంఐఎం
- చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ -ఎంఐఎం
- యాకుత్‌పుర జాఫర్ హుస్సేన్ -ఎంఐఎం
- బహదూర్‌పుర మహ్మద్ ముబీన్ -ఎంఐఎం
- సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్ -బీఆర్ఎస్
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందిత సాయన్న -బీఆర్ఎస్
- కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి -కాంగ్రెస్
- నారాయణపేట చిట్టెం పర్ణికా రెడ్డి- కాంగ్రెస్
- మహబూబ్‌నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి -కాంగ్రెస్
- జడ్చర్ల అనిరుధ్ రెడ్డి -కాంగ్రెస్
- దేవరకద్ర ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి -బీఆర్ఎస్
- మక్తల్ వాకిటి శ్రీహరి- కాంగ్రెస్
- వనపర్తి తూడి మేఘారెడ్డి -కాంగ్రెస్
- గద్వాల కృష్ణ మోహన్ -బీఆర్ఎస్
- అలంపూర్ విజయుడు -బీఆర్ఎస్
- నాగర్‌కర్నూల్ డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి -కాంగ్రెస్
- అచ్చంపేట చిక్కడు వంశీ కృష్ణ -కాంగ్రెస్
- కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి -కాంగ్రెస్
- షాద్‌నగర్ కె.శంకరయ్య -కాంగ్రెస్
- కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు -కాంగ్రెస్
- దేవరకొండ నెనావత్ బాలూ నాయక్ -కాంగ్రెస్
- నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ -రెడ్డి కాంగ్రెస్
- మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి -కాంగ్రెస్
- హుజూర్‌నగర్ నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి-కాంగ్రెస్
- కోదాడ నలమడ పద్మావతి రెడ్డి-కాంగ్రెస్
- సూర్యాపేట జగదీశ్ రెడ్డి -బీఆర్ఎస్
- నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి -బీఆర్ఎస్
- మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి -కాంగ్రెస్
- భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి -కాంగ్రెస్
- నకిరేకల్ వేముల వీరేశం -కాంగ్రెస్
- తుంగతుర్తి మందుల శ్యాములు -కాంగ్రెస్
- ఆలేరు బీర్ల ఐలయ్య- కాంగ్రెస్
- జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి -బీఆర్ఎస్
- స్టేషన్ ఘన్‌పూర్ కడియం శ్రీహరి -బీఆర్ఎస్
- పాలకుర్తి మామిడాల యశస్విని -కాంగ్రెస్
- డోర్నకల్ జాటోత్ రామచందర్ నాయక్- కాంగ్రెస్
- మహబూబాబాద్ భుక్యా మురళీ నాయక్ -కాంగ్రెస్
- నర్సంపేట దొంతి మాధవరెడ్డి -కాంగ్రెస్
- పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి -కాంగ్రెస్
- వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి -కాంగ్రెస్
- వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ -కాంగ్రెస్
- వర్దన్నపేట కేఆర్ నాగరాజు -కాంగ్రెస్
- భూపాలపల్లి గండ్ర సత్యానారాయణరావు- కాంగ్రెస్
- ములుగు డి.అనసూయ (సీతక్క) -కాంగ్రెస్
- పినపాక పాయం వెంకటేశ్వర్లు -కాంగ్రెస్
- ఇల్లందు కోరం కనకయ్య -కాంగ్రెస్
- ఖమ్మం తుమ్మల నాగేశ్వర రావు- కాంగ్రెస్
- పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -కాంగ్రెస్
- మధిర మల్లు భట్టి విక్రమార్క -కాంగ్రెస్
- వైరా మాలోతు రామ్‌దాస్ -కాంగ్రెస్
- సత్తుపల్లి మట్టా రాగమయి -కాంగ్రెస్
- కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు- సీపీఐ
- అశ్వారావుపేట జారె ఆదినారాయణ -కాంగ్రెస్
- భద్రాచలం డాక్టర్ తెల్లం వెంకట్రావ్ -బీఆర్ఎస్.
You may like
-
అమ్మ పరివార్ సంస్థకు తెలంగాణ సేవా రత్న అవార్డు
-
Shanmukh Jaswanth Arrest |గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్
-
గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి ఆగమనం….ప్రక్రియ ఇదే|Medaram Sammakka Jathara
-
మొదలయిన మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర |Medaram Jathara-Sammakka Jathara
-
మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులను చితకబాదిన టీచర్
-
మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు.
Viral న్యూస్
గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి ఆగమనం….ప్రక్రియ ఇదే|Medaram Sammakka Jathara
Published
9 months agoon
February 22, 2024న్యూస్ పల్స్,ములుగు జిల్లా:డప్పు చప్పుళ్లతో, కోయల నృత్యాలతో, పోటెత్తిన భక్తుల జయజయ ధ్వనుల నడుమ సారలమ్మ తల్లి మేడారం గద్దెపైకి బుధవారం రాత్రి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది.( Medaram Sammakka-Sarakka Jathara Started)
సారలమ్మ తల్లిని మేడారం గద్దె వద్దకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం రోజు ఉదయం నుంచే సారలమ్మ వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచి ఆర్భాటంగా మొదలైంది.(Sarakka Arrived To Medaram) తొలుత సారలమ్మ ఆలయాన్ని కోయపూజారులు శుద్ధి చేసి, ముగ్గులతో అలంకరించిన అనంతరం, కోయపూజారులు వారి గిరిజన సంప్రదాయ ప్రకారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రత్యేక పూజలు వారు చేశారు.
సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన కోయ పూజారి సారయ్య కు,భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి దారిలో తండోపా తండాలుగా దారిపొడవునా భక్తులు బారులుతీరి హారతులిచ్చారు.
ఎట్టకేలకు రాత్రి 12.11 గంటలకు సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. మహబూబాబాద్,గంగారం మండలం పూనుగొండ గ్రామం నుండి పగిడిద్ద రాజుని, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును కూడ మేడారం గద్దెలపైకి కోయ పూజారులు చేర్చారు.
అంతకుముందు పగిడిద్దరాజు-సమ్మక్కల కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
–ఇక మేడారం జాతర ఈ రెండో రోజు మరింత ప్రత్యేకం :-(Medaram Sammakka jathara)
సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క తల్లి గురువారం(ఈరోజు) గద్దెపైకి చేరుకొనుంది. సమ్మక్క తల్లి ఆగమనం కోసం ఉదయమే అన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని పూజారులు శుద్ధి చేస్తారు.
ఆలయానికి మామిడి తోరణాలు కట్టి, తల్లి శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేస్తారు. కోయ పూజారులు అడవికి వెళ్లి వెదురువనం, అడెరాలు తెచ్చి గద్దెపై నిలిపి, ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం మేడారం జాతర ప్రధాన కోయ పూజారి కొక్కెర కృష్ణయ్య మరియు వారి పూజారుల బృందంతో కలిసి చిలుకలగుట్ట సమీపంకి వెళ్తారు.
అక్కడి నుంచి చిలుకలగుట్టకి ప్రధాన కోయ పూజారి కొక్కెర కృష్ణయ్య ఒక్కరే వెళతారు. అక్కడ ఉన్న సమక్క రూపమైన కుంకుమ భరిణను, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కొక్కెర కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహించి,
ఈ గిరిజన సంప్రదాయ పూజా అంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి కొక్కెర కృష్ణయ్య తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు ఓ వస్తున్నట్టు సంకేతం మిగిత వారికీ ఇస్తారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే, అక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రులు మరియు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మరియు ఇతర ఉన్నతాధికారులంతా సమ్మక్క తల్లికి ఘన స్వాగతం పలుకుతారు.
సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో తుపాకీని పేల్చుతారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క కిందకు వచ్చే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు,ఆట పాటలతో అందరిని అలరిస్తారు.
పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత వేగంగా మేడారం గద్దెవైపు కదులుతారు. దారి పొడవునా భక్తులు బారులుతీరి మంగళహారతులు పడుతూ, తల్లికి కోళ్లు, గొర్రెలను బలిస్తారు. వీలైనంత వరకు ఈరోజు రాత్రి 9-10 గంటల మధ్య ప్రాంతంలో సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకువచ్చేలా జిల్లా యంత్రాంగం మొత్తం సమిష్టి కృషి చేస్తోంది. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరో కీలక స్థాయికి చేరుతుంది…
Viral న్యూస్
మొదలయిన మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర |Medaram Jathara-Sammakka Jathara
Published
9 months agoon
February 21, 2024Madaram Jatara 2024:న్యూస్ పల్స్ తెలుగు: తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒక్కసారి, మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో ఎంతో ప్రతిష్టమ్మకంగా జరిగే మేడారం మహా జాతర ఎంతో విశిష్టమైనది. ప్రపంచవ్యప్తంగా ప్రఖ్యాతిగాంచిన జాతరే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.
నేటి నుండి నాలుగు రోజులపాటు సాగుతుంది ఈ జాతర.
ఒక్కోరోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మొత్తం మారు మ్రోగిపోతుంది.
అశేషామైన భక్త జనవాహిని మధ్య,భావోద్వేగ సమ్మేళనం మధ్య, సారలమ్మను ఇవాళ మేడారంలో గద్దె మీద ప్రతిష్టిస్తారు.(Medaram Sarakka -2024)
అత్యంత రహస్యంగా కోయ పూజారులు పూజలు చేశాక.. కన్నేపల్లి నుండి జై సారలమ్మ.. జైజై సారలమ్మ అంటూ,జన సద్రోహం మధ్య జై జైలు కొడుతూ సారలమ్మ తల్లి ప్రతిష్టాపన జరుగుతుంది.
సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో జరిగే ప్రతి ఘట్టానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం రోజును, వన దేవతల వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు.. ఈరోజు మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకార కార్యక్రమం జరుగుతుంది.
నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జాతర ఘన లాంఛనంగా మొదలవుతుంది.
ఈ మేడారం మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె అనే పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూజ కార్యక్రమం పూర్తయితే జాతర మొదలైనట్లేనని అక్కడి ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లల్లో పండుగ రోజులు ప్రారంభం అవ్వడంతో బంధువులు వారి ఇంటికి వస్తారు. ఈ మేడారం మహా జాతర ఇవాళ్టి నుండి ఈ నెల 24 వరకు జరుగుతుంది.
మేడారం మహా జాతర విశేషాలు:
ఈ మేడారం మహా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది.
రెండేళ్లకోసారి జరిగే ఈ మేడారం మహా జాతరకు ప్రతి యేటా కోట్లాది సంఖ్యలోభక్తులు హాజరు అవుతుంటారు.
ఈ యేటా ఇంకా మరింత సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ మేడారం మహా జాతరలో ప్రధానంగా ఈ నాలుగు రోజులు, నాలుగు ఘట్టాలు ఉంటాయి.
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో ఈ మేడారం మహా జాతర ఊపందుకుంటుంది.
సారలమ్మను ఈరోజు సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు.
సారలమ్మ జాతర గద్దె పైకి రాకముందే ఏటూరునాగారం మండలం, కొండాయి నుంచి గోవిందరాజును, అలాగే మహబూబాబాద్ జిల్లా, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడక ద్వారా మేడారం తీసుకొచ్చి జాతర గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
జాతర సందర్భంగా సమ్మక్క, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కోయ పూజారులు వివాహం జరిపిస్తారు.
ఈ మేడారం మహా జాతరకు ఒక రోజు ముందు అంటే మంగళవారం పగిడిద్దరాజును ఆయన స్వస్థలమైన పూనుగొండ్లలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా తయారుచేసి వేడుకను నిర్వహించారు.
బుధవారం మధ్యాహ్నం వరకు వడ్డె ఇంటి నుంచి పసుపు, కుంకుమ, కొత్త బట్టలతో పగిడిద్దరాజును మేడారం ఆలయానికి చేరుకుంటారు.
బయల్దేరే ముందు యాటను బలిచ్చి, ఆదివాసీ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నిన్న (మంగళవారం) రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుని అక్కడ పెనక వంశీయుల ఇంటి వద్ద బస చేసిన పగిడిద్దరాజు ఇవాళ సాయంత్రం గద్దెలపై ప్రతిష్టించబడతారు.
ఈ మేడారం జాతరలో,నాలుగు రోజులే కీలకమైనవి:
బుధవారం జాతర ప్రారంభం అవుతుంది. మొదటిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ జాతర గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజును, కొండాయి నుంచి గోవిందరాజును,గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభం అవుతుంది.
రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.
మూడో రోజు శుక్రవారం, ఈ రోజే ప్రత్యమైన రోజు,గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు జాతర గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా, తండుపతండాలుగా తరలివస్తారు.
నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులను మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులంతా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
ఈ వాగులోనే పుణ్యస్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది.
ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్నవాగు ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున నదుల్లో జరిగే కుంభమేళాను తలపిస్తుంది. దీంతో ఈ మేడారం మహా జాతర తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను పిలుస్తున్నారు.
Tags:Medaram, Sammakka sarakka jathara 2024, Sammakka jathara 2024, Medaram, News Pulse Telugu, viral news,
స్పెషల్ ఆర్టికల్స్
ఓ ఓటరు జర ఆలోచించు… భవిషత్తు కొరకై ఓటు వెయ్యి..
Published
11 months agoon
November 29, 2023న్యూస్ పల్స్ తెలుగు: ఓ ఓటరు జర అలోచించి ఓటు వెయ్యి, నీ కొరకు కాదు, భవిష్యత్తు కోసం.
(Importance Of Vote): ఈ దేశంలో ప్రజా ప్రతినిధి అంటే ప్రజల చేత స్వచ్చందంగా ఎన్నుకోవాడం, ప్రజల పక్షాన నిలబడే వారిని ఎన్నుకోవడం, ప్రజల సమస్యల పరిస్కారం చేసి భరోసా అందించే, ఓ గొప్ప నాయకున్ని ఎన్నుకోవడం.
ఓటు,వాస్తవానికి ఈ ఇదో గొప్ప ప్రక్రియ, సామాన్యుని గుండె ధైర్యం, అంబెడ్కర్ గారు మనకు అందించిన గొప్ప అస్త్రం, మన భవిష్యత్తునీ చూపేదే ఓటు.
ప్రస్తుతం ఉన్న నాయకులు,ప్రజలు అంత నాయకులు ప్రలోభ పెడితే, ప్రలోభాలకు గురై, తమ ఓటు హక్కుని అమ్ముకొని, ఎంతో ఇబ్బందులకు పాలవుతున్నారు.
ఓటు నీ అమ్ముకుంటే నిన్ను నువ్వు అమ్ముకున్నట్లే.
వెయ్యి రూపాయలకు ఆశపడి ఓటు అమ్ముకునే ముందు,1000×365÷1000= 1.8పైసలు
అంటే నీ విలువ రోజుకి 1.8 పైసలు, అయిదు సంవత్సరాలకు నీ విలువ ఇదా.
ఈ సారైనా ఓటర్లంతా చైతన్యవంతులై సరైన, నాయకున్ని, సరైన ప్రభుత్వంనీ మనస్ఫూర్తిగా ఎంచుకొని, భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని ఓటర్ లను విజ్ఞప్తి చేస్తున్నాం.