న్యూస్పల్స్తెలుగు: ధరణి పోర్టల్‌తో రైతుల భూములను ఎవ్వరు గోల్‌మాల్ చేయలేరని సీఎం కేసీఆర్(KCR) అన్నారు. పినపాక మరియు భద్రాచలం నియోజకవర్గాల బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఈరోజు బూర్గంపాడులో జరిగింది.
బూర్గంపాడులో జరిగిన ఈ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై BRS పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మొదలు పెట్టిన ధరణి పోర్టల్‌తో రైతుల భూములను ఎవరూ గోల్‌మాల్ చేయలేరని కెసిఆర్ స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చినప్పడి నుండి, ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాన్ని మీకే ఇచ్చిందని మీ భూమి యాజమాన్యం మారాలంటే.. గతంలో ప్రభుత్వ అధికారులు మార్చేదని, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదని అన్నారు, మీ బొటన వేలు పెడితే తప్ప, మీ భూమిని ఎవరూ గోల్‌మాల్ చేయలేరని,ఇప్పుడిప్పుడే రైతులు అప్పుల నుంచి తేరుకుంటున్నరని అన్నారు సీఎం కెసిఆర్ .
ఎన్నికలకు చాలా సమయం ఉందని, గ్రామాలు, పట్టణాలకు బస్తీలకు వెళ్లిన తర్వాత పెద్ద మనుషులతో చర్చ పెట్టాలని,నిజానిజాలు తెల్చాలని,వాస్తవాలను గమనించి ముందుకుపోతేనే మన బతుకులు బాగుపడుతయ్ అని లేక పోతే దెబ్బతిని బాధలు పడుతాం అని సీఎం కెసిఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్ పుట్టుక మీ కండ్లముందే అని,బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ చరిత్ర మీకు తెలుసు. 120-130 సంవత్సరాల కిందట పుట్టింది. బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర కూడా మీముందుంది. ఈ పార్టీల వైఖరిపై బాగా చర్చచేయాలని అయన అన్నారు. ఈ ఎన్నిక పినపాక వరకు భద్రాచలం వరకో ఉండదు. ఇక్కడ గెలిచే అభ్యర్థులను బట్టి రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడుతుందని,ఆ ప్రభుత్వం సరైన నడక నడిస్తే ప్రజాబాహుల్యానికి మేలు జరుగుతుందని,లేకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంటుందని కెసిఆర్ అన్నారు.
ఇక్కడ గిరిజనులు విశేషంగా ఉండే ప్రాంతం, గిరిజనులతో పాటు దళిత వర్గాల ప్రజలు ఉన్నరు,వాళ్ల బతుకులు బాగా లేవు,వాళ్లకు భూములు కూడా లేవు,అది వాస్తవం అని కెసిఆర్ అన్నారు.
ఎలా వెళ్లాలో అర్థంకాని పరిస్థితి నుండి కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి బాధ్యతతో పటిష్టంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకెళ్లాలని కంకణబద్ధులమై పని చేశాం’ అని తెలిపారు.
ఈసారి కూడా మళ్ళీ BRS ప్రభుత్వం వస్తే ఇంకా అభివృద్ధి చేసి మనం అనుకున్న బంగారు తెలంగాణను నిర్మించవచ్చని కెసిఆర్ అన్నారు.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students