న్యూస్పల్స్తెలుగు, రామగుండం: తెలంగాణ ఎన్నికల పచారంలో భాగంగా ఈరోజు బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ రామగుండంలో మధ్యాహ్నం 1:00గం”లకు పర్యటించనున్నారు.
గోదావరిఖనిలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని,సీఎం కెసిఆర్ ప్రసంగించనున్నారు. రామగుండం Brs పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ కొరకై సీఎం కెసిఆర్ ప్రచారం నిర్వహించనున్నారు.
ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఎన్నికలల్లో ఒకఎత్తు ఉంటే రామగుండంలో మాత్రం ప్రజల తీర్పు ఎప్పుడు విభిన్నంగానే ఉంటుంది.
ప్రస్తుతం రామగుండంలో పలు ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్ లు తమ ప్రచారంని కొనసాగిస్తూ, ప్రతిరోజు వినూత్నంగా ప్రజలవద్దకు వెళ్తున్నారు.
గడప గడపకు వెళ్లి అభ్యర్థులు తమను గెల్పించాలని ఓటర్లను కోరుతున్నారు.
CM కెసిఆర్ రాకతో రామగుండంలో BRS జెండా ఎగురావేయనుందా..?
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కెసిఆర్ నేడు రామగుండంకి మరియు మరో మూడు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
అయితే రామగుండంలో BRS ప్రభుత్వం పై కొంత వ్యతిరేకత ఉండటంతో ఈ ఛాన్స్ గా ప్రధాన పార్టీలు,ఇండిపెండెంట్ అభ్యర్థులు వాటిని చూపిస్తూ, ప్రస్తుత అభ్యర్థుల మ్యానిఫెస్టో ఓటర్లకు వివరిస్తూ, ఈ సారి BRS పార్టీకి కాకుండ తమకి ఓటువేయాలని కోరుతున్నారు.
ఇటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై కొన్నీ ఆరోపణలు ఉండగా, వీటన్నిటిని చూపిస్తూ అభ్యర్థులు తమకే ఓటువేయాలని ఓటర్లను కోరుతున్నారు.
అయితే రామగుండం నియోజకవర్గలో జరిగే ఈ సభకు ముఖ్యమంత్రి, BRS అధినేత కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు అవుతున్న సమయంలో.. ఈ ఒక్క కెసిఆర్ సభతో రామగుండంలో BRS పార్టీ చక్రం తిప్పి, రామగుండం పై BRS జెండా ఎగరనుందా అనే ప్రశ్నలు ప్రజలనుండి వస్తున్నాయి.
అందరి నాయకుల స్పీచ్ ఒక లెక్క అయితే కెసిఆర్ స్పీచ్ కి సపరేట్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ యాసలో ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా, కెసిఆర్ స్పీచ్ ఉంటుంది.
BRS మేనిఫెస్టో ని కెసిఆర్ ప్రసగించి, ప్రజలకు వివరించి,తమ హామీలను ప్రజలకు వ్యక్తపరచడంలో సఫలం అవుతారా అని చూడాలి.
ప్రస్తుతం జరిగే ఈ ఎన్నికల సమయంలో, నేడు జరగబోయే సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ తర్వాత, ప్రజల్లో ఒక ప్రత్యక మార్పు తీసుక రానుందా,ప్రస్తుతం రామగుండం ఎమ్మెల్యే గా కొనసాగే కోరుకంటి చెందర్ తిరిగి ఈసారి కూడా మళ్ళీ విజయం సాధించి రామగుండం పై మరోసారి గులాబీ జెండా ఎగురా వేయనున్నారా అనే విషయం తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students