Connect with us

Viral న్యూస్

మీ అనుమతి లేకుండా ఫోటోలు మార్ఫింగ్ చేస్తే.. ఎం చెయ్యాలి..?

Published

on

What to do if someone is using your morphed images/video to blackmail you?

న్యూస్ పల్స్ తెలుగు : ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో, టెక్నాలజీ ఎంతగానో అప్డేట్ అవుతుంది.
దీనికితోడు ప్రస్తుతం Ai(Artificial intelegence) టెక్నాలజీ తో ప్రస్తుత సమాజానికి ఎంత ఉపయోగం ఉందొ, అదే విధంగా కొంత మంది చీడ పురుగుల వికృత ఆలోచనల వాళ్ళ Ai టెక్నాలజీ తో అంతే చెడు కూడా అంతే ఉంది.
Ai టెక్నాలజీ తో ప్రస్తుత సమాజానికి, మరియు భావితరాలకు ఎంతగానో ఉపయోగం ఉంది కానీ దానిని కొంత మంది దుర్వినియోగం చెయ్యడం ప్రస్తుతం అందరం చూస్తూనే ఉన్నాం.

Ai టెక్నాలజీ తో ఏ పనిని అయిన సులువుగా క్షణాల నిడివిలోనే చేసి ఇస్తుంది.
ఇలా ప్రస్తుతం Ai టెక్నాలజీతో, కొంతమంది సమాజంలో ఉన్న చీడపురుగులు ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేస్తూ, మహిళలను ఇబ్బంది పెడుతూ, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ, రాక్షస ఆనందాన్ని పొందుతూ, వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తూ, డబ్బులు ఇవ్వకపోతే వారి యొక్క ఫోటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటనలను తరచూ మనము చూస్తూనే ఉంటున్నాం…

Rashmika mandana Fake morphed visuals going viral..

ప్రస్తుతం వైరల్ గా హీరోయిన్ రష్మిక మందన యొక్క సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, వేరే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ లో ఎక్కుతున్న వీడియోను మార్ఫింగ్ చేసి రష్మిక మందన ఉన్నట్టు కుదించారు.
దీనిపై అటు రష్మిక మందన, మరియు ఇతరప్రముఖ నటులు కూడా ఈ విషయంపై స్పందించి లీగల్ సెల్ కి ఫిర్యాదులు చేశారు.

ప్రస్తుతం ఒక సినీ తారలే కాకుండా, సామాజిక మధ్యమంలో ఎక్కువగా పాపులర్ అయిన వారిని కూడా టార్గెట్ గా పెట్టుకొని వారి యొక్క ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు.
అలాగే సామాన్యుల ఫోటోలను కూడా ఇదే విధంగా మార్ఫింగ్ చేస్తూ వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఎన్నో రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో కూడా మహిళలు ప్రొఫైల్ పిక్చర్ ను తొలగించాలని వారిని వారు సేఫ్ గా ఉండే విధంగా ఎన్నో సూచనలను సామాజిక మాధ్యమాల్లో వారి యొక్క ఆత్మీయులు ఎప్పటికి అప్పుడు చెప్తూనే ఉంటున్నారు.

ఒకవేళ ఇదే సమస్య మనలో ఒక్కరికి, మన కుటుంబంలో ఆత్మీయులకి ఒక్కరికి జరిగితే మనం ఎం చేయాలనే విషయం, చాలావరకు ఎవరికీ తెలియదు, ఇలాంటి విషయాలు తెలియక ఎంతోమంది ఎన్నో అభాగ్యాలకు పాల్పడుతూ ఉంటారు.

ఒకవేళ ఇదే సమస్య మనకు ఎదురైతే ఏం చేయాలి..?

మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేస్తే, చేసి ఎవరైనా భయభ్రాంతులకు గురి చేయడం వంటివి చేస్తే మొట్టమొదట చేయాల్సిన పని:

Cyber Crime Helpline

మొదటిగా సైబర్ క్రైమ్ 1930 కు కాల్ చేసి వారి యొక్క సమస్యను వారికి తెలియజేయాలి.

తర్వాత ఒకవేళ వారి యొక్క మార్ఫింగ్ చేసిన ఫోటోలు లేదా వీడియోలు ఏదైనా వెబ్ సైట్ లో అప్లోడ్ చేసినట్లయితే…

https://stopncii.org/ అనే వెబ్సైట్ కి వెళ్లి, లాగిన్ అయ్యి,
మార్ఫింగ్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన ఆ ఫోటోను, అదేవిధంగా ఒరిజినల్ ఫోటోను ఈ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలి. అంతే,

కొద్ది గంటల్లోనే సంబంధిత సైబర్ క్ర్రైమ్ అధికారులు
ఆ ఫోటో ఇంటర్నెట్లో ఎక్కడ ఉన్నాసరే తీసేయడం దానిని పూర్తిగా తొలగించడం జరుగుతుంది.

ఇలా చేయడం ద్వారా, ఇటు మనం ఎదుర్కొంటున్న సమస్యలో నుండి త్వరగా బయటికి రావచ్చు, అదేవిధంగా ఫోటోలు మరియు వీడియోలను మార్ఫింగ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు.

ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క, మిత్రులతో స్నేహితులతో పంచుకొని, వారు అవగాహన చెందే విధంగా చేయండి, ఒకవేళ ఎవరైనా ఈ సమస్యపై బాధపడుతున్నట్లయితే వారికి మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు.

Spread the love

Viral న్యూస్

Shanmukh Jaswanth Arrest |గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.

మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.

బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)

ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.

షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు
వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.

ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..

Tags: Bigboss, Shanmukh Jashwanth, Youtube, drugs, arrest

Spread the love
Continue Reading

Viral న్యూస్

గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి ఆగమనం….ప్రక్రియ ఇదే|Medaram Sammakka Jathara

Published

on

న్యూస్ పల్స్,ములుగు జిల్లా:డప్పు చప్పుళ్లతో, కోయల నృత్యాలతో, పోటెత్తిన భక్తుల జయజయ ధ్వనుల నడుమ సారలమ్మ తల్లి మేడారం గద్దెపైకి బుధవారం రాత్రి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది.( Medaram Sammakka-Sarakka Jathara Started)

సారలమ్మ తల్లిని మేడారం గద్దె వద్దకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం రోజు ఉదయం నుంచే సారలమ్మ వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచి ఆర్భాటంగా మొదలైంది.(Sarakka Arrived To Medaram) తొలుత సారలమ్మ ఆలయాన్ని కోయపూజారులు శుద్ధి చేసి, ముగ్గులతో అలంకరించిన అనంతరం, కోయపూజారులు వారి గిరిజన సంప్రదాయ ప్రకారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రత్యేక పూజలు వారు చేశారు.

సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన కోయ పూజారి సారయ్య కు,భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి దారిలో తండోపా తండాలుగా దారిపొడవునా భక్తులు బారులుతీరి హారతులిచ్చారు.

ఎట్టకేలకు రాత్రి 12.11 గంటలకు సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. మహబూబాబాద్‌,గంగారం మండలం పూనుగొండ గ్రామం నుండి పగిడిద్ద రాజుని, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును కూడ మేడారం గద్దెలపైకి కోయ పూజారులు చేర్చారు.

అంతకుముందు పగిడిద్దరాజు-సమ్మక్కల కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇక మేడారం జాతర ఈ రెండో రోజు మరింత ప్రత్యేకం :-(Medaram Sammakka jathara)

సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క తల్లి గురువారం(ఈరోజు) గద్దెపైకి చేరుకొనుంది. సమ్మక్క తల్లి ఆగమనం కోసం ఉదయమే అన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని పూజారులు శుద్ధి చేస్తారు.

ఆలయానికి మామిడి తోరణాలు కట్టి, తల్లి శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేస్తారు. కోయ పూజారులు అడవికి వెళ్లి వెదురువనం, అడెరాలు తెచ్చి గద్దెపై నిలిపి, ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం మేడారం జాతర ప్రధాన కోయ పూజారి కొక్కెర కృష్ణయ్య మరియు వారి పూజారుల బృందంతో కలిసి చిలుకలగుట్ట సమీపంకి వెళ్తారు.

అక్కడి నుంచి చిలుకలగుట్టకి ప్రధాన కోయ పూజారి కొక్కెర కృష్ణయ్య ఒక్కరే వెళతారు. అక్కడ ఉన్న సమక్క రూపమైన కుంకుమ భరిణను, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కొక్కెర కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహించి,
ఈ గిరిజన సంప్రదాయ పూజా అంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి కొక్కెర కృష్ణయ్య తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు ఓ వస్తున్నట్టు సంకేతం మిగిత వారికీ ఇస్తారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే, అక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రులు మరియు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, మరియు ఇతర ఉన్నతాధికారులంతా సమ్మక్క తల్లికి ఘన స్వాగతం పలుకుతారు.

సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో తుపాకీని పేల్చుతారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క కిందకు వచ్చే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు,ఆట పాటలతో అందరిని అలరిస్తారు.

పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత వేగంగా మేడారం గద్దెవైపు కదులుతారు. దారి పొడవునా భక్తులు బారులుతీరి మంగళహారతులు పడుతూ, తల్లికి కోళ్లు, గొర్రెలను బలిస్తారు. వీలైనంత వరకు ఈరోజు రాత్రి 9-10 గంటల మధ్య ప్రాంతంలో సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకువచ్చేలా జిల్లా యంత్రాంగం మొత్తం సమిష్టి కృషి చేస్తోంది. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరో కీలక స్థాయికి చేరుతుంది…

Spread the love
Continue Reading

Viral న్యూస్

మొదలయిన మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర |Medaram Jathara-Sammakka Jathara

Published

on

Madaram Jatara 2024:న్యూస్ పల్స్ తెలుగు: తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒక్కసారి, మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో ఎంతో ప్రతిష్టమ్మకంగా జరిగే మేడారం మహా జాతర ఎంతో విశిష్టమైనది. ప్రపంచవ్యప్తంగా ప్రఖ్యాతిగాంచిన జాతరే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.
నేటి నుండి నాలుగు రోజులపాటు సాగుతుంది ఈ జాతర.
ఒక్కోరోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మొత్తం మారు మ్రోగిపోతుంది.
అశేషామైన భక్త జనవాహిని మధ్య,భావోద్వేగ సమ్మేళనం మధ్య, సారలమ్మను ఇవాళ మేడారంలో గద్దె మీద ప్రతిష్టిస్తారు.(Medaram Sarakka -2024)
అత్యంత రహస్యంగా కోయ పూజారులు పూజలు చేశాక.. కన్నేపల్లి నుండి జై సారలమ్మ.. జైజై సారలమ్మ అంటూ,జన సద్రోహం మధ్య జై జైలు కొడుతూ సారలమ్మ తల్లి ప్రతిష్టాపన జరుగుతుంది.

సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో జరిగే ప్రతి ఘట్టానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం రోజును, వన దేవతల వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు.. ఈరోజు మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకార కార్యక్రమం జరుగుతుంది.
నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జాతర ఘన లాంఛనంగా మొదలవుతుంది.
ఈ మేడారం మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె అనే పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూజ కార్యక్రమం పూర్తయితే జాతర మొదలైనట్లేనని అక్కడి ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లల్లో పండుగ రోజులు ప్రారంభం అవ్వడంతో బంధువులు వారి ఇంటికి వస్తారు. ఈ మేడారం మహా జాతర ఇవాళ్టి నుండి ఈ నెల 24 వరకు జరుగుతుంది.


మేడారం మహా జాతర విశేషాలు:

ఈ మేడారం మహా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది.
రెండేళ్లకోసారి జరిగే ఈ మేడారం మహా జాతరకు ప్రతి యేటా కోట్లాది సంఖ్యలోభక్తులు హాజరు అవుతుంటారు.
ఈ యేటా ఇంకా మరింత సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ మేడారం మహా జాతరలో ప్రధానంగా ఈ నాలుగు రోజులు, నాలుగు ఘట్టాలు ఉంటాయి.
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో ఈ మేడారం మహా జాతర ఊపందుకుంటుంది.
సారలమ్మను ఈరోజు సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు.
సారలమ్మ జాతర గద్దె పైకి రాకముందే ఏటూరునాగారం మండలం, కొండాయి నుంచి గోవిందరాజును, అలాగే మహబూబాబాద్ జిల్లా, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడక ద్వారా మేడారం తీసుకొచ్చి జాతర గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
జాతర సందర్భంగా సమ్మక్క, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కోయ పూజారులు వివాహం జరిపిస్తారు.
ఈ మేడారం మహా జాతరకు ఒక రోజు ముందు అంటే మంగళవారం పగిడిద్దరాజును ఆయన స్వస్థలమైన పూనుగొండ్లలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా తయారుచేసి వేడుకను నిర్వహించారు.
బుధవారం మధ్యాహ్నం వరకు వడ్డె ఇంటి నుంచి పసుపు, కుంకుమ, కొత్త బట్టలతో పగిడిద్దరాజును మేడారం ఆలయానికి చేరుకుంటారు.
బయల్దేరే ముందు యాటను బలిచ్చి, ఆదివాసీ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నిన్న (మంగళవారం) రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుని అక్కడ పెనక వంశీయుల ఇంటి వద్ద బస చేసిన పగిడిద్దరాజు ఇవాళ సాయంత్రం గద్దెలపై ప్రతిష్టించబడతారు.

ఈ మేడారం జాతరలో,నాలుగు రోజులే కీలకమైనవి:
బుధవారం జాతర ప్రారంభం అవుతుంది. మొదటిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ జాతర గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజును, కొండాయి నుంచి గోవిందరాజును,గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభం అవుతుంది.

రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.

మూడో రోజు శుక్రవారం, ఈ రోజే ప్రత్యమైన రోజు,గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు జాతర గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా, తండుపతండాలుగా తరలివస్తారు.

నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులను మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులంతా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
ఈ వాగులోనే పుణ్యస్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది.

ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్నవాగు ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున నదుల్లో జరిగే కుంభమేళాను తలపిస్తుంది. దీంతో ఈ మేడారం మహా జాతర తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను పిలుస్తున్నారు.

Tags:Medaram, Sammakka sarakka jathara 2024, Sammakka jathara 2024, Medaram, News Pulse Telugu, viral news,

Spread the love
Continue Reading