Connect with us

క్రైమ్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి

Published

on

న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖనిలోని 2ఇంక్లైన్ మోరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.(Singareni)
మృతుడు గోదావరిఖని విట్టల్ నగర్ కు చెందిన కౌటం సంపత్ 11 ఇంక్లైన్ బాయి కార్మికుడిగా కార్మికుడుగా గుర్తింపు.
కాగా కార్మికుడు నైట్ డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పక్క నుంచి వెళ్తున్న బొగ్గు లారీలో ఉన్న ఓ భారీ బొగ్గు పెళ్ల, సంపత్ తలపై పడడంతో, కింద పడిపోయిన సంపత్, ఆయన తలపై నుండి గుర్తు తెలియని వాహనం యొక్క టైర్లు వెళ్లడంతో, సంపత్ అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్టు సమాచారం.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.

కాగఈరోజు ఉదయం 11 ఇంక్లైన్ గని కార్మికులు,11 ఇంక్లైన్ గని ముందు బయటయించి నిరసన తెలిపారు.
నూతనంగా ప్రారంభించిన రోడ్డు తమను మృత్యువాత పట్టిస్తుందని,
తమకు రోడ్డును పునరుద్ధరణ చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలని సింగరేణి అధికారులను, డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
కార్మికులు చేసే ఈ నిరసనకు కార్మిక సంఘ నాయకులు కూడా మద్దతుగా గని వద్దకు చేరుకున్నారు.
అధికారుల వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.

Spread the love

క్రైమ్ న్యూస్

దొంగతనం కేసులో మూడు నెలల జైలు శిక్ష

Published

on

న్యూస్ పల్స్ తెలుగు,మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కల్మలాపేట గ్రామనికి చెందిన సల్పలా శ్రీనివాస్ కు బెల్లంపల్లి కోర్టు జడ్జి ముకేశ్ మూడు నెలల జెలు శిక్ష విధించినట్లు నీల్వయి ఏస్ఐ సుబ్బారావు తెలిపారు మూడు నెలల క్రితం కల్మలాపేటలో రాజేందర్ ఇంట్లో ఎవరూలేని సమయం లో దొంగతనం జరిగింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేసి సల్పలా శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు నేరం రుజువు కావడంతో జడ్జి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

Spread the love
Continue Reading

క్రైమ్ న్యూస్

ప్రేమించిన పెళ్ళాడిన సఖిని కోల్పోయి యువకుడి ఆత్మహత్య

Published

on

న్యూస్ పల్స్ తెలుగు : చిన్న వయసులో ప్రేమ వివాహం అయ్యి, గర్భం దాల్చడంతో, రక్త హీనతతో యువతి మృతి చెందింది …అది తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సాయితరుణ్ (22) ఇదే గ్రామానికి చెందిన జ్యోతిక ఇరువురు ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో వారి తల్లిదండ్రులు,పెద్దలు అంగీకరించడకపోవడంతో వారిని ఎదురించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు ఈ ఇద్దరు దంపతులు.

కాగా జ్యోతిక గర్బిణి అయ్యి,నెల కిందట రక్తహీనత వ్యాదితో ఆసుపత్రిలో జ్యోతిక మృతి చెందింది.తీవ్ర మనస్థాపానికి గురైన భర్త సాయి తరుణ్ వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు సాయి తరుణ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం సాయి తరుణ్ ని హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నస్పూర్ మున్సిపాలిటీకి పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన శెట్టిపల్లికి వారి తల్లిదండ్రులు బంధువులు తరలించారు.

Spread the love
Continue Reading

క్రైమ్ న్యూస్

భార్యను హత్య చేసిన భర్త… ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్ రీల్స్

Published

on

న్యూస్ పల్స్ తెలుగు: సోషల్ మీడియా ద్వారా ప్రయోజనాలు పొందే వారు ఎంత మంది ఉన్నారో అటు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతి చేసుకొని వ్యక్తిగత జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్న ఘటనలు అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా కోల్ కతాలో ఓ తాపీ మేస్త్రి తన భార్యను దారుణంగా హత్య చేసి హతమార్చాడు అందుకు కారణం, అయన భార్య చేసే ఇంస్టాగ్రామ్ రీల్స్, ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ పలువురితో పరిచయాలు పెంచుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆమె పేరు అపర్ణ ఆమె భర్త పేరు పరిమళ్ బైద్య వీరికీ ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు.

35 ఏళ్ల అపర్ణ తరచుగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ఫేమస్ అయ్యి అనేకమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. వారిలో కొందరితో నిత్యం చాటింగ్ చేస్తుండేది అపర్ణ,ముఖ్యంగా తరుచు ఓ రుణ మంజూరు సంస్థకు చెందిన ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడుతుండేది. అపర్ణ వైఖరిని భర్త పరిమళ్ బైద్య తీవ్రంగా వ్యతిరేకించేవాడు, కండించే వాడు.
ఆమెకు రుణ మంజూరు సంస్థ ఉద్యోగితో అక్రమ సంబంధం ఉందని అనుమానించేవాడు, దాంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి అప్పుడప్పుడు అపర్ణ పుట్టింటికి కూడా వెళుతుండేది.

అపర్ణ తన పద్ధతి మార్చుకోక, ఇంస్టాగ్రామ్ లో తరచూ రీల్స్ చేయడంతో, అపర్ణ ఇక మారదని ఒక నిర్ణయానికి వచ్చిన భర్త గొంతు కోసి చంపేశాడు, అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు.

ట్యూషన్ కి వెళ్ళిన కుమారుడు తిరిగి ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి తన తల్లి అపర్ణ రక్తపు మడుగులో పడి ఉంది, ఆ అబ్బాయి భయంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, పరారీలో ఉన్న పరిమళ్ బైద్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు, అపర్ణ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

(more…)

Spread the love
Continue Reading