న్యూస్పల్స్తెలుగు: మాంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గనిలో గురువారం సాయంత్రం ప్రమాదవ శాత్తు గాయపడి ఫిట్టర్ కార్మికుడు మృతి చెందాడు. తోటి కార్మికుల కథనం ప్రకారం వివరాలుఇలా ఉన్నాయి. ఆర్కే 7గనిలో మధ్యాహ్నం మిడిల్ షిఫ్ట్ ఫిట్టర్ విధులు నిర్వహిస్తున్న సుర్మిల్ల వెంకటేశ్(35) సింగరేణి కార్మికుడు ఒక్క సారిగా ప్రమాదవ శాత్తు కిందపడ్డారు. అటుగా ఉన్న ట్రావలింగ్ రోల్పైపై పడడంతో వెంకటేశ్ తల నొసలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే తోటి కార్మికులు స్థానిక ఏరియాస్పత్రికి వెంకటేష్ ని తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కోమాలోకి వెల్లి మృతి చెందినట్లు తెలిపారు. కార్మికున్ని మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ పలితం లేకుండా పోయింది. మృతి చెందిన వెంకటేష్ కు భార్య శ్రవంతి, ఒక కుమారుడు, ఒక కూతురున్నారు. కార్మికుడు నస్పూర్ సీసీసీ ఆర్కే 5కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రమాదంపై వివరాలు అధికారులను వివరాలు అడిగే ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని సమాచారం.సంఘటన స్థలానికి కార్మిక సంఘాల నాయకులు చేరుకొని కుటుంబ సబ్యులకు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు. కార్మికునికి సంస్థ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందేలా చూస్తామని కుటుంబంకి హామీ ఇచ్చారు. ప్రమాదంపై గని అధికారులు విచారణ చేస్తున్నారు.
న్యూస్ పల్స్ తెలుగు,మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కల్మలాపేట గ్రామనికి చెందిన సల్పలా శ్రీనివాస్ కు బెల్లంపల్లి కోర్టు జడ్జి ముకేశ్ మూడు నెలల జెలు శిక్ష విధించినట్లు నీల్వయి ఏస్ఐ సుబ్బారావు తెలిపారు మూడు నెలల క్రితం కల్మలాపేటలో రాజేందర్ ఇంట్లో ఎవరూలేని సమయం లో దొంగతనం జరిగింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేసి సల్పలా శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు నేరం రుజువు కావడంతో జడ్జి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
న్యూస్ పల్స్ తెలుగు : చిన్న వయసులో ప్రేమ వివాహం అయ్యి, గర్భం దాల్చడంతో, రక్త హీనతతో యువతి మృతి చెందింది …అది తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సాయితరుణ్ (22) ఇదే గ్రామానికి చెందిన జ్యోతిక ఇరువురు ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో వారి తల్లిదండ్రులు,పెద్దలు అంగీకరించడకపోవడంతో వారిని ఎదురించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు ఈ ఇద్దరు దంపతులు.
కాగా జ్యోతిక గర్బిణి అయ్యి,నెల కిందట రక్తహీనత వ్యాదితో ఆసుపత్రిలో జ్యోతిక మృతి చెందింది.తీవ్ర మనస్థాపానికి గురైన భర్త సాయి తరుణ్ వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సాయి తరుణ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం సాయి తరుణ్ ని హైదరాబాద్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నస్పూర్ మున్సిపాలిటీకి పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన శెట్టిపల్లికి వారి తల్లిదండ్రులు బంధువులు తరలించారు.
న్యూస్పల్స్తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖనిలోని 2ఇంక్లైన్ మోరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.(Singareni) మృతుడు గోదావరిఖని విట్టల్ నగర్ కు చెందిన కౌటం సంపత్ 11 ఇంక్లైన్ బాయి కార్మికుడిగా కార్మికుడుగా గుర్తింపు. కాగా కార్మికుడు నైట్ డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పక్క నుంచి వెళ్తున్న బొగ్గు లారీలో ఉన్న ఓ భారీ బొగ్గు పెళ్ల, సంపత్ తలపై పడడంతో, కింద పడిపోయిన సంపత్, ఆయన తలపై నుండి గుర్తు తెలియని వాహనం యొక్క టైర్లు వెళ్లడంతో, సంపత్ అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.
కాగఈరోజు ఉదయం 11 ఇంక్లైన్ గని కార్మికులు,11 ఇంక్లైన్ గని ముందు బయటయించి నిరసన తెలిపారు. నూతనంగా ప్రారంభించిన రోడ్డు తమను మృత్యువాత పట్టిస్తుందని, తమకు రోడ్డును పునరుద్ధరణ చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలని సింగరేణి అధికారులను, డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కార్మికులు చేసే ఈ నిరసనకు కార్మిక సంఘ నాయకులు కూడా మద్దతుగా గని వద్దకు చేరుకున్నారు. అధికారుల వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.