News Pulse Telugu:మెగా ఫ్యామిలీ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటిస్తున్న తాజా సినిమా “పెద్ది”( Peddi) ఈ సినిమా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ , సుకుమార్ రైటింగ్స్ ద్వారా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు, బుచ్చిబాబు సానా,సంగీతం ఏ.ఆర్. రెహమాన్ (Bucchi Babu Sana, A.R Rehaman) అందిస్తున్నారు.
Peddi Film: Bucchi Babu Sana, A.R Rehaman
నటీనటులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ చిత్రంలో కనిపించునున్నారు.
“పెద్ది సినిమా”(Peddi Film) ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు.
సినిమా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ ఆడుతూ కనిపించారు.
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ద్విపాత్ర నటులుగా నటించిన గేమ్ చేంజర్,సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిన చిత్రం వారు ఉహించిన ఫలితాలు రాకుండా, అటు ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది.
అయితే ప్రముఖ దర్శకులు సుకుమార్ యొక్క శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రానికి అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే భారీ బడ్జెట్ తో విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించక పోయిన కారణంగా, గ్లోబల్ స్టార్ కూడా ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ పెద్ది సినిమా మార్చ్27, 2026 లో తెలుగు, హిందీ, తమిళ్,కనడ, భాషల్లో విడుదల కానుంది.
News Pulse Telugu,మేడ్చల్: ఆడపిల్లలకు ప్రస్తుతం ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు ఎన్ని ప్రత్యక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట తరుచు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ లిమిట్స్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు ఆ దుర్మార్గ కీచకులతో పోరాడింది.
ఇటీవలే జరిగిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుండగులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి వారికీ బయపడకుండా వారికీ ప్రతిఘటించడంతో అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండుగా ఆమెను ఈ కీచకులు అడ్డుకున్నారు . ఆ యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా, అస్సలే అధైర్య పడకుండా వారితో ధైర్యంగా పోరాడింది. ఆ కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది ఆ యువతి. ఒక్కసారిగా దుండగులందరూ ఆ యువతి మీదకు రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో యువతి దాడి చేసి తప్పించునేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ ఆ దుండగులు యువతి వెంటపడటంతో తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది యువతి. చివరకు ఆ దుండగుల భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని యువతి వెంటనే మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పోలీస్ స్టేషన్ లో దుండుగులు ఏ విధంగా తనను ఇబ్బందులకు గురిచేశారు.. తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరంగా వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును మేడ్చెల్ పోలీసులు, రైల్వే పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఆ రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ పలు మార్లు ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది దుండగులు గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని,గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు భద్రత పెంచాలంటూ పలు డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్‌లో జరిగిన ఘటనపై పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు ఈ కేసును బదిలీ చేయగా.. వారు కేసును విచారణ జరుపుతున్నారు.
కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో ఆ యువతికి కూడా కొంత మేరకు గాయాలు అవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
శ్రీ రామనవమి చరిత్ర చాలా పురాతనమైనది, దేశవ్యాప్తంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ శ్రీరామ నవమి. ఇది భగవాన్ శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర శుద్ధ నవమిగా భావించబడుతుంది.చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిది తేదీన పున్నమి నక్షత్రం సమయంలో రాముడు జన్మించాడు.ప్రతియేట ఈ శ్రీరామ నవమిని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అస్సలు శ్రీ రామనవమి చరిత్ర…?
రాముడు త్రేతాయుగంలో అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యపాలన చేస్తున్న కాలంలో,దశరథ మహారాజు కు సంతానం లేకపోవడంతో యాగాలు చేస్తాడు. పుత్రకామేష్టి యాగం ఫలితంగా శ్రీమహావిష్ణువు నాలుగవ అవతారంగా రాముడిగా జన్మిస్తాడు.
దేవతలు రాక్షసుల అల్లర్ల వల్ల భూభారంగా వుండగా, విష్ణువును ప్రార్థించగా ఆయన రాముడిగా అవతరించాడని ఓ విశ్వాసం. రావణుని సంహారం కోసం ఈ అవతారం తీసుకున్నాడని పౌరాణిక విశ్వాసం.
శ్రీరామ నవమి పండుగ విధానం..?
శ్రీ రామ నవమి రోజు ఈ పండుగను పలుచోట్ల పలు రకాలుగా జరుపుకుంటారు, కొన్నిచోట్ల రాముడి జన్మకథ వినడం, రామాయణ పారాయణం చేస్తారు. ఎక్కువ శాతం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు(Sri Rama Kalyanam) అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ శ్రీరాముని కళ్యాణానికి భద్రాచలం చాలా ఫేమస్. కొన్ని చోట్లల్లో ప్రజలు ఉపవాసం ఉంటారు, కొన్ని చోట్ల పానకమ్,జాగ్రతితో చేసిన తేనె లేదా బెల్లం నీరు, వడపప్పు, పులిహోర శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కనుక ఆలయాల్లో జరిగే కళ్యాణానికి హాజరై భక్తులందరికీ, చల్లటి మజ్జిగ, బెల్లం పానకం అందజేస్తారు. శ్రీరాముని కళ్యాణోత్సవం ముగించిన తర్వాత, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథాలలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు.
శ్రీరామనవమి ఉత్సవ సందేశం..
ఈ పండుగ ధర్మం, సత్యం,నిజాయితీ, శాంతి, మర్యాదకు,నైతికతలను నెమలే రోజు అని చెబుతారు. శ్రీరాముని జీవితం హిందూ ధర్మంలో ఆదర్శంగా భావిస్తారు. శ్రీరాముడు తన జీవితంలో చూపిన విలువలు నేటికి ప్రజలు వారి జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటారు. ఈ శ్రీరామనవమి ఉత్సవం కేవలం పండుగ కాకుండా, తెలుగువారి సంస్కృతిని మానవ విలువలను గుర్తుచేసే అద్భుతమైన పండుగని భావిస్తారు.
News Pulse Telugu : Alekhyaa Chitti Pickles, ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అవసరం లేదు, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఎన్నో వివాదాలతో పేరు జోరుగా వినిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని, ఆ వివాదాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం…
Alekhyaa Chitti Pickles ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు అక్క చెల్లెలు కలిసి నిర్వహిస్తున్నారు. వారు వివిధ రకాల పికిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ యొక్క వ్యాపారానికి ముందు ఈ ముగ్గురు అక్క చెల్లెలు, సోషల్ మీడియా వేదికగా, ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లలో పలు వీడియోలను చిత్రీకరిస్తూ, మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. యొక్క సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫేమ్ ని, వారి యొక్క వ్యాపారాన్ని ఉపయోగించుకుంటూ పచ్చళ్ల విక్రయాన్ని కొనసాగించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
అయితే, కొందరు వినియోగదారులు వారి నాణ్యత మరియు ధరల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మార్కెట్ ప్రకారం చూసుకున్న, మార్కెట్లో ఉన్న ధరలకు రెండింతలుగా వీరి యొక్క పికిల్స్ ధరలతో విక్రయస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ పికిల్స్ ని కొన్న వినియోగదారులు కూడా వారి యొక్క పికిల్స్ కు సంతృప్తి చెందడం లేదు, వారు నిర్ణయించిన ధరకు, పికిల్స్ రుచి, నాణ్యత అంతగా లేకపోవడం వినియోగదారులను తీవ్ర నిరాశకు తరచూ గురిచేస్తుందని చాలామంది వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా వారికి నేరుగా తెలుపుతున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్‌కు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా నడుస్తున్నాయి.
అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వివాదం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఆడియో క్లిప్‌ల చుట్టూ తిరుగుతోంది. ఈ క్లిప్‌లలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థకు చెందిన వ్యక్తి కస్టమర్లతో దురుసుగా, అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆడియోలో కస్టమర్లతో సంస్థ ప్రతినిధులు మాట్లాడినట్లుగా ఉన్న అనేక ఆడియో క్లిప్‌లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వీటిలో కొందరు కస్టమర్లు ధరల గురించి లేదా ఇతర సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు దురుసుగా సమాధానం చెప్పిన ఆడియో క్లిప్పులు బయటపడి ఈ విషయం పెద్ద రచ్చగా మారింది.బూతు పదజాలంతో కొన్ని ఆడియో క్లిప్‌లలో సంస్థ ప్రతినిధులు కస్టమర్లను తిడుతూ, బూతులతో, కస్టమర్ యొక్క కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అనరాని మాటలు అనడంతో, ఈ విషయం నెట్టింట చర్చగా మారింది, ప్రస్తుతం ఈ విషయమే ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
ఈ ఆడియో క్లిప్‌లు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వివాదం మీమర్స్ అందరికీ ఒక మంచి కంటెంట్ గా మారింది, ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో ఇదే ట్రెండింగ్ ఇష్యూగా మారింది. చాలా మంది నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వ్యాపారం తాత్కాలికంగా ఆగిపోయినట్లే తెలుస్తుంది, వారి సంస్థ యొక్క వాట్సప్ అకౌంట్ డిలీట్ చేశారు.
ఈ విషయం పై తీవ్ర వివాదానికి దారితీస్తున్న సమయంలో, అలేఖ్య చిట్టి పికిల్స్ సంస్థ యొక్క నిర్వహకులు క్షమాపణలు తెలుపుతూ ఒక వీడియోను వారి యొక్క వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంపై ఆ వీడియోలో నిర్వాహకులు మాట్లాడుతూ తొలుత తమను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని వాదించారు. అయితే, తరువాత అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వాహకులు అలేఖ్య స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి, తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పింది. ఆమె ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆ వీడియోలో కోరింది.
క్షమాపణ చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగలేదు. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరు ఇది కావాలని చేస్తున్న ప్రచారం అని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం అనేది సంస్థ ప్రతినిధుల దురుసు ప్రవర్తన మరియు బూతు పదజాలం కారణంగా తలెత్తి, సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. క్షమాపణ చెప్పినప్పటికీ, ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.