న్యూస్ పల్స్ తెలుగు,గోదావరిఖని : గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం రోజు ప్రెస్ క్లబ్ ఆవరణలో జరగనున్నాయి.ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కు జరిగే ఎన్నికల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు పోటీపడుతున్న వారు తమ తమ ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ సభ్యులను ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. మార్పు కోసం సభ్యుల సంక్షేమం కోసం తమ ప్యానల్ నే గెలిపించాలని ప్రెస్ క్లబ్ సభ్యులను ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. కాగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు జనరల్ బాడీ సమావేశం తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని విజేతలైన అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుందని ప్రెస్ క్లబ్ సీనియర్ పాత్రికేయులు ఎన్నికల అధికారి వేల్పుల నారాయణ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి పాలకుర్తి విజయ్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి త్రిముఖ పోటీ ఏర్పడింది.అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించిన సీనియర్ పాత్రికేయల నాయకత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.దీంతో త్రి ముఖ పోటీ ఏర్పడింది. ఒక అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు క్లబ్ ఫౌండర్ నాయిని మధునయ్య, సీనియర్ సిటీ కేబుల్ రిపోర్టర్ గతంలో ప్రధాన కార్యదర్శిగా చేసిన పూదరి కుమార్, సీనియర్ జర్నలిస్ట్ మాధవరావు అధ్యక్ష పోటీ బరిలో ఉన్నారు.
ప్రధాన కార్యదర్శి పదవికి ముచ్చకుర్తి కుమారస్వామి, శ్యాంసుందర్,జీవన్ బాబు,రాజ్ కుమార్,శ్రీధర్ పోటీ పడుతున్నారు.
ఉపాధ్యక్షులుగా బి శ్రీమన్నారాయణ, రవీందర్,శ్రీనివాస్ పోటీలో ఉండగా కోశాధికారిగా గడ్డం శ్యామ్,గంట రవీందర్ పోటీలో ఉన్నారు.
సహాయ కార్యదర్శి,కార్యవర్గ సభ్యులుగా పోటీ చేస్తున్న వాళ్లు ఉన్నారు.11 కార్యవర్గ సభ్యులు పోస్టులకు గాను 24 మంది పోటీలో ఉన్నారు. ఎవరి ప్యానల్ ను వాళ్లు గెలిపించుకోవాలని గత వారం రోజుల నుండి ప్రచారం ముమ్మరం చేశారు.ప్రెస్ క్లబ్ సభ్యుల ఓట్లను తమ ప్యానల్ కే వేయాలంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.నేడు ప్రెస్ క్లబ్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students