న్యూస్ పల్స్ తెలుగు: (Dasara)-దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరు కుటుంబ సమేతంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారుఈ కార్యక్రమానికి. అసలు రావణ దహన వేడుకలు ఎందుకు జరుగుతాయి అనే విషయం ఎవ్వరికి దాదాపుగా తెలియదు,అందులో ప్రస్తుత యువతకి అయితే దాదాపు ఎవ్వరికి ఈ విషయం పై అవగాహణ అయితే అస్సలు లేదు.
ప్రతి దసర పండుగకి వివిధ ఊర్లల్లో, నగరాల్లో పలు చోట్ల అందరు రావణ దహనం జరిగాక జమ్మి పెట్టి ఒకరికి ఒకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అసలు ఈ రావణ దహనం ఎందుకు చేస్తారో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం.
అసలు దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారు….?
దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి మన చరిత్ర మరియు పురాణాల ప్రకారం, శ్రీరాముని పాలనా కాలంనుండే ఈ విజయదశమిని విజయ ప్రస్థానంగా ఆచరణ లోకి తీసుకున్నారు . శ్రీరాముడు ఈ రోజే రావణుడి పై దండెత్తి యుద్దనికి వెళ్లాడట,వెళ్లి రావణాసురుడు పై విజయం సాధించాడట. చెడు పై మంచి గెలుపు సూచికగా ఈ విజయదశమి రోజున ప్రజలంతా కలిసి రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ చంద్రుడు దుర్గాదేవిని స్మరించి రావణ సంహారం చేయగా దేవతలంత ఆనందభరితులై దేవీ పూజ చేశారు. నాటి నుండిఇప్పటి వరకు అశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దుర్గ దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహించి పదవ రోజున విజయదశమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
రాముడు రావణుని మీదకు యుద్దానికి వెడలిన దినం విజయదశమి అని వేద పండితులు చెబుతుంటారు.విజయదశమి రోజున రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏమిటంటే, రోజు రోజుకీ ఆడవారి పై అత్యాచారాలు పెరగిపోతున్న ఈ రోజుల్లో పర స్త్రీని తల్లిలా,సోదరిల, పూజించాలని, లేకపోతే రావణుడిలాగా ఏదో ఒక రోజు వారి పాపం పండి దహించుకుపోతారని అందుకే మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని ఈ యొక్క రావణ దహనం సందేశం ఇస్తుంది, అందుకు దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడతారు.
చెడు పై కొంత ఆలస్యమైన మంచి ఎప్పుడైన జయీస్తుంది అనే సూచకంగా దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడతారు.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students