Connect with us

క్రైమ్ న్యూస్

ప్రియుడి మొజులో బర్తని హత్య చేసిన భార్య

Published

on

న్యూస్ పల్స్ తెలుగు, పెద్దపల్లి జిల్లా: రాను రాను మానవత్వం మంటకలిసి పోతుంది,
ఈనెల 29-10 -2023 రోజు రాత్రి రామగుండం పరిధి లో జరిగిన హత్య కేసు నిందితులను 48 గంటలు తిరక్కముందే రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏ సీ పీ తుల శ్రీనివాస్ రావు విలేకరుల సమావేశంలో తెలిపారు.
మాల్యాలపల్లి సబ్ స్టేషన్ కి సమీపంలో తేదీ 29-10-23 రోజున రాత్రి సమయంలో మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం మేరకు రామగుండం ఎస్ ఐ వెంకటేష్ , సి ఐ, చంద్ర శేఖర్ గౌడ్, ఏ సీ పీ తుల శ్రీనివాస్ రావు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి ఆనవాళ్ళ కోసం ప్రయత్నం చేసారు.
చనిపోయిన వ్యక్తి పేరు లావుడియ మధుకర్,s/o నాన్యా నాయక్(30), గా గుర్తించారు.
పోతన కాలనీ,8 incline కాలనీ నివసిగా గుర్తించారు.
మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేయగా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
మృతుడిని అతడి భార్య లావుడియా రమ తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడు గోవర్ధన్ మరో ఇద్దరితో కలసి పథకం ప్రకారం హత్య చేసినారని తెలిసింది.


పోలీసుల సమాచారం ప్రకారం సంఘటన నేపథ్యం..

మృతుడు లావుడియ మధుకర్ సింగరేణి ఉద్యోగం చేస్తూ పోతన కాలనీ, 8 ఇంక్లైన్ కాలనీ గోదావరిఖని ఉంటున్నాడు. మృతుడి భార్య లావుడియా అలియాస్ నునసవత్ రమకి ఒక పెళ్లి సంబంధం విషయంలో ధరావత్ గోవర్ధన్ అనునతడితో పరిచయం అయి వారి పరిచయ అక్రమ సంబంధం గా మారింది. గోవర్ధన్ తరచు మృతుడి ఇంటికి వస్తూ పోతూ మరియు మృతుడి భార్య తో ఫోన్లో మాట్లాడుకోవడం ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడే రెండు మూడు రోజులు ఉండేవాడు, అది చూసి మృతుడికి అతడి భార్య పై అనుమానం రావడం తో అతడిని చంపేయాలని తర్వాత ఎటువంటి అడ్డు ఉండదు అని నిందితురాలు మృతుని భార్య ఇచ్చిన సలహా మేరకు ప్రియుడు గోవర్ధన్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. నిందితుడు గోవర్ధన్ మృతుడు మధుకర్ ని బయటకు ఎటు అయిన తీసుకు వెళ్ళి మందు తాగిచ్చి చంపి ఎవ్వరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదం లా చనిపోయినట్లు చిత్రీకరిస్తే నీకు కూడా ఉద్యోగం వస్తది అని పథకం వేసుకొన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం సంఘటన జరిగిన తీరు….

తేదీ 29 10 2023 నాడు మృతుడు ఉదయం యధావిధిగా డ్యూటీ కి పోయి తిరిగి మధ్యాహ్నం కాలుకు దెబ్బ తగిలిందని వచ్చి భోజనం చేసి మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ డ్యూటీ కి పోయి సుమారు మూడున్నర గంటలకు ఇంటికి వచ్చినడు. సాయంత్రమే గోవర్దన్ అతడి స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్ లతో కలసి నాచారం నుండి మధుకర్ ను చంపాలనే ఉద్దేశ్యం తో ఒక ఇనుప రాడ్ నాగరాజు యొక్క హీరో గ్లామర్ బైక్ ఫూట్రెస్ట్ వద్ద కనబడ కుండ కట్టుకొని గోదావరిఖని కి వచ్చి, రాత్రి 07:00 గంటలకు గోవర్ధన్ నిండుతురాలు రమకి ఫోన్ చేసి మృతుడి తో మాట్లాడి బయటకి రమ్మని చెప్పగా మృతుడు మధుకర్ తన పల్సర్ బైక్ పై రావడం తో అందరూ గోదావరిఖని 5 ఇంక్లైన్ వద్ద కలసుకొని అక్కడ రాజా రాణి వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసి అందరూ కలసి మాల్యాలపల్లి సబ్ స్టేషన్ వద్ద u టర్న్ తీసుకొని మంచిర్యాల వెళ్ళే రోడ్డు వైపుకి కొద్ది దూరం వచ్చి రోడ్డు పక్కన మోటార్ సైకిళ్ళు అపి చెట్లల్లో తాగుతుండగా గోవర్ధన్ ముందుగానే మోటార్ సైకిలు కి కట్టుకున్న ఇనుప రాడ్ ని తీసుకుని మృతుడికి కనబడకుండా అతడి వెనుక కనబడకుండా పెట్టి అనతరం గోవర్ధన్ అతడి ఫ్రెండ్స్ నాగరాజు, లక్ష్మన్ లు కలిసి ఇనుపరాడళతో తలపై కొట్టి చంపిన, తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో పడేసి అతని పల్సర్ బైక్ డామేజ్ చేసి, స్టార్ట్ చేసి అతని మీదకు వదిలి పెడితే అది పక్కకు పడినది, ఈ విషయం గోవర్ధన్, మృతుడి భర్య రమకి వాట్స్ అప్ ద్వారా ఫోన్ చేసి చెప్పి అనంతరం నిందితులంతా మోటార్ సైకిల్ పై పరార్ అయ్యారు.

నిందితురాలు రమ మృతుడి తల్లిదండ్రులకి బంధువులకి తన భర్త రోడ్డు ప్రమాదంలోనే చనిపోయినాడు అని అనుకునేలా నమ్మబలికినది.

నిందితులు పట్టుబడిన విధానం..

మృతుడి తల్లిదండ్రులు, సోదరులు మృతుడి భార్య రమ నే తన భర్తని హత్య చేయించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరిపి మృతుడి హత్యలో అతడి భార్య రమ తో పాటు మరో ముగ్గురు పాత్ర కూడా ఉందని బయటపడడం తో నిందితులందరిని అదుపులోకి తీసుకొని విచారించగ వారు చేసిన నేరం అంగీకరించారు.

Spread the love

క్రైమ్ న్యూస్

దొంగతనం కేసులో మూడు నెలల జైలు శిక్ష

Published

on

న్యూస్ పల్స్ తెలుగు,మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కల్మలాపేట గ్రామనికి చెందిన సల్పలా శ్రీనివాస్ కు బెల్లంపల్లి కోర్టు జడ్జి ముకేశ్ మూడు నెలల జెలు శిక్ష విధించినట్లు నీల్వయి ఏస్ఐ సుబ్బారావు తెలిపారు మూడు నెలల క్రితం కల్మలాపేటలో రాజేందర్ ఇంట్లో ఎవరూలేని సమయం లో దొంగతనం జరిగింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేసి సల్పలా శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు నేరం రుజువు కావడంతో జడ్జి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

Spread the love
Continue Reading

క్రైమ్ న్యూస్

ప్రేమించిన పెళ్ళాడిన సఖిని కోల్పోయి యువకుడి ఆత్మహత్య

Published

on

న్యూస్ పల్స్ తెలుగు : చిన్న వయసులో ప్రేమ వివాహం అయ్యి, గర్భం దాల్చడంతో, రక్త హీనతతో యువతి మృతి చెందింది …అది తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సాయితరుణ్ (22) ఇదే గ్రామానికి చెందిన జ్యోతిక ఇరువురు ప్రేమించుకోగా కులాలు వేరు కావడంతో వారి తల్లిదండ్రులు,పెద్దలు అంగీకరించడకపోవడంతో వారిని ఎదురించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు ఈ ఇద్దరు దంపతులు.

కాగా జ్యోతిక గర్బిణి అయ్యి,నెల కిందట రక్తహీనత వ్యాదితో ఆసుపత్రిలో జ్యోతిక మృతి చెందింది.తీవ్ర మనస్థాపానికి గురైన భర్త సాయి తరుణ్ వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు సాయి తరుణ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం సాయి తరుణ్ ని హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నస్పూర్ మున్సిపాలిటీకి పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన శెట్టిపల్లికి వారి తల్లిదండ్రులు బంధువులు తరలించారు.

Spread the love
Continue Reading

క్రైమ్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి

Published

on

న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖనిలోని 2ఇంక్లైన్ మోరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.(Singareni)
మృతుడు గోదావరిఖని విట్టల్ నగర్ కు చెందిన కౌటం సంపత్ 11 ఇంక్లైన్ బాయి కార్మికుడిగా కార్మికుడుగా గుర్తింపు.
కాగా కార్మికుడు నైట్ డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పక్క నుంచి వెళ్తున్న బొగ్గు లారీలో ఉన్న ఓ భారీ బొగ్గు పెళ్ల, సంపత్ తలపై పడడంతో, కింద పడిపోయిన సంపత్, ఆయన తలపై నుండి గుర్తు తెలియని వాహనం యొక్క టైర్లు వెళ్లడంతో, సంపత్ అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్టు సమాచారం.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.

కాగఈరోజు ఉదయం 11 ఇంక్లైన్ గని కార్మికులు,11 ఇంక్లైన్ గని ముందు బయటయించి నిరసన తెలిపారు.
నూతనంగా ప్రారంభించిన రోడ్డు తమను మృత్యువాత పట్టిస్తుందని,
తమకు రోడ్డును పునరుద్ధరణ చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలని సింగరేణి అధికారులను, డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
కార్మికులు చేసే ఈ నిరసనకు కార్మిక సంఘ నాయకులు కూడా మద్దతుగా గని వద్దకు చేరుకున్నారు.
అధికారుల వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.

Spread the love
Continue Reading