న్యూస్ పల్స్ తెలుగు: గురువారం రామగుండం Brs ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్(Korukanti Chander) తన నామినేషన్ సందర్భంగా అయన ర్యాలీను Brs నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నిర్వహించారు. తిలక్ నగర్ డౌన్ లోని ఆయన ఇంటి నుండి మొదలుకొని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, లక్ష్మీనగర్, ఖని ప్రధాన చౌరస్తా, మున్సిపల్ టి జంక్షన్ ద్వారా ర్యాలీ కొనసాగింది.చౌరస్తా నుండి ఎటుచూసినా నలువైపులా కనుచూపుమేర కార్యకర్తలు, జనంతో కిక్కిరిసిపోయాయి.
ముందుగా తన నామినేషన్ ను పురస్కరించుకొని స్టేడియం పక్కనున్న జయదుర్గా దేవి ఆలయంలో రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ (koppula Eswar), స్నేహలత దంపతులతోపాటు జనగామలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, సుందిల్లలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయం, ప్రాంగణంలోని శివాలయం, అయ్యప్ప దేవాలయం, పవర్ హౌజ్ కాలనీలోని కాశీ విశ్వేశ్వరాలయం, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాలలో చందర్ ప్రత్యేక పూజలు చేసారు.అనంతరం చందర్ తన తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు.
తిలక్ నగర్ డౌన్ లోని తన ఇంటి నుండి బిఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, మహిళలు, అభిమానులు వెంటరాగా, డప్పులు, బ్యాండు మేళాలు, మంగళ వాయిద్యాలు, ఒగ్గుడోలు బృందాలు, బతుకమ్మలు, మహిళల కోలాట నృత్యాలు, రామక్కపాటకు లయబద్దంగా నృత్యం చేస్తున్న కళాకారులు, యువకులతో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభకు ప్రత్యేక వాహనంలో ర్యాలీగా తరలివెళ్లారు.
స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభా వేదికపై హిందూ పురోహితులు, ముస్లిం మౌల్వీలు, క్రైస్తవ ఫాస్టర్ లు చందర్ గారికి దైవ ఆశీర్వచనాలు అందజేశారు. సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన చౌరస్తాలోని అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి, మున్సిపల్ టి జంక్షన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఎన్టిపిసి టిటిఎస్ లోని నామినేషన్ కేంద్రానికి తరలివెళ్లారు.
గురువారం Brs ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ తన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభ, అనంతరం ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ పత్రాలను, Brs పార్టీ శ్రేణులతో,కార్యకర్తలతో,అభిమానులతో కలిసి ఎన్టిపిసి టిటిఎస్ లోని నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ వేశారు.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.Ok