యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదు: సందీప్ రెడ్డి వంగ
న్యూస్ పల్స్ తెలుగు: (Animal Movie) బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా,ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సెన్సార్ బోర్డు కూడా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ యానిమల్ మూవీ చిన్న పిల్లలు చూసేది కాదని, 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాలని ఈ చిత్రం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలిపారు. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.ప్రస్తుతానికి 18ఏళ్ళు నిండని వారు ఈ సినిమాని చూడకూడదని అయన అన్నారు.
News Pulse Telugu:మెగా ఫ్యామిలీ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) నటిస్తున్న తాజా సినిమా “పెద్ది”( Peddi) ఈ సినిమా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ , సుకుమార్ రైటింగ్స్ ద్వారా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు, బుచ్చిబాబు సానా,సంగీతం ఏ.ఆర్. రెహమాన్ (Bucchi Babu Sana, A.R Rehaman) అందిస్తున్నారు.
Peddi Film: Bucchi Babu Sana, A.R Rehaman
నటీనటులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ చిత్రంలో కనిపించునున్నారు.
“పెద్ది సినిమా”(Peddi Film) ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు.
సినిమా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ ఆడుతూ కనిపించారు.
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ద్విపాత్ర నటులుగా నటించిన గేమ్ చేంజర్,సినిమా దాదాపు 450కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిన చిత్రం వారు ఉహించిన ఫలితాలు రాకుండా, అటు ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది.
అయితే ప్రముఖ దర్శకులు సుకుమార్ యొక్క శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రానికి అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే భారీ బడ్జెట్ తో విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించక పోయిన కారణంగా, గ్లోబల్ స్టార్ కూడా ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ పెద్ది సినిమా మార్చ్27, 2026 లో తెలుగు, హిందీ, తమిళ్,కనడ, భాషల్లో విడుదల కానుంది.
న్యూస్పల్స్తెలుగుహైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు.
చంద్రమోహన్ వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్‌లోనే చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని అయన కుటుంబ సభ్యులు తెలిపారు.
చంద్రమోహన్ హీరోగా, మంచి హాస్య నటుడిగా, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు.ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తెలుగులో ఒకప్పుడు గొప్ప గొప్ప హీరోయిన్లుగా వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్ తో నటించిన వారే.
చంద్రమోహన్ పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో అప్పుడు ఉండేది. అదే నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
కృష్ణాజిల్లా పమిడిముక్కలలో1942 మే 23న జన్మించారు చంద్రమోహన్. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. ఇప్పటి వరకు 932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. 1966వ సంవత్సరంలో రంగులరాట్నం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.
ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల యొక్క మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు చెంద్రమోహన్. తెలుగు వారి హృదయాల్లో చంద్రమోహన్ ఎప్పటికి నిలిచి పోతారు. అయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనంమంతా కోరుకుందాం.