న్యూస్పల్స్తెలుగు: (Telangana Assembly Elections) ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫీవర్ రాష్ట్రం మొత్తంఉంది. ఇన్ని రోజులు ఒక్క ఎత్తు అయితే ఈ ఒక్కరోజు ఒక్కఎత్తు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తు అయితే (Ramagundam)రామగుండంలోఒక ఎత్తు ఉంటుంది. రామగుండం ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డ, ప్రజలు అంత చాలా చైతన్యవంతులు. ఇక్కడ పార్టీలతో సంబంధం ఉండదు, కేవలం వ్యక్తులతోనే సంబంధం. సాధారణంగా ప్రజలంతా పార్టీల మ్యానిఫెస్టో ద్వారా ఓట్లు వేస్తే, ఇక్కడి ప్రజలు పార్టీలకు అతీతంగా,రామగుండంలో మాత్రం ఎవరైతే ప్రజలకు నచ్చుతారో, ఏ నాయకులయితే ప్రజల మనస్సులో స్థానం సంపాదిస్తారో వారే విజయం సాధించడం ఇక్కడి అనవయితీ. ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య హారహోరి గా ఉంది, మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడి కొంతమంది మేధావులు, విశ్లేషకులు త్రిమూఖ పోటీ ఉండనుంది అంటూ అంచనా వేస్తున్నారు.
కానీ సర్వేల ప్రకారం క్లియర్ కట్ గా బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ల మధ్య పోటీ ఉండబోతునట్లు తెలుస్తుంది.
కాగా ఈరోజు ప్రజా తీర్పు ఎలా ఉంటుందో, ఎవరి జెండా రామగుండం గడ్డ పై ఎగరనుందో చూడాలి.
రామగుండం నియోజకవర్గం లో ప్రధాన పార్టీలనుండి, కోరుకంటి చందర్ ప్రస్తుత ఎమ్మెల్యే, BRS పార్టీ నుండి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ పార్టీ నుండి మక్కాన్ సింగ్, బీజేపీ పార్టీ నుండి కందుల సంధ్య రాణి బరిలో ఉన్నారు. అలాగే రామగుండం నియోజకవర్గం కి మూడు దఫలు ఎమ్మెల్యే గా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ ఈ సారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
కాగా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరికీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తున్నారు అనే విషయం తెలియాలంటే, డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాలి.
న్యూస్ పల్స్ తెలుగు: పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని అమ్మ పరివార్ స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న నిర్విరామ సేవలకు, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవలకు, పిల్లల ఆశ్రమ నిర్వహణకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు, నిరుపేద విద్యార్థులకు, మరియు మరెన్నో సేవా కార్యక్రమాలకు గాను.. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్ లోని ఓ ఫంక్షన్ హల్ లో,వివిఆర్ ఫౌండేషన్ వారు, సినీ ప్రముఖులు, గీతా భాస్కర్( చిత్ర నటి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి), యాక్టర్ వాసుదేవరావు, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అమ్మ పరివార్ సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కరణ్ కు తెలంగాణ సేవా రత్న అవార్డును అందజేశారు.
పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా, అమ్మ పరివార్ సేవా సంస్థ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, విష్ణు రావు వివరించగా, ప్రముఖులు అమ్మ పరివార్ సంస్థ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అందజేస్తున్న ఈ అవార్డుల ప్రధానం కి, అమ్మ పరివార్ సంస్థ సేవలను గుర్తించి ఈ యొక్క అవార్డును అందజేసినందుకు, వివిఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు విష్ణు రావుకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ పల్స్ తెలుగు, హైదరాబాద్: ఇటీవల చాలా మంది యూట్యూబ్ లో ఫేమస్ వ్యక్తులు, సెలబ్రేటిలు సైతం కటకటాల పాలు అవ్వుతున్నారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓ యూట్యూబర్ ను పోలీసుల అదుపులోకి తుసుకున్నారు.
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ను మరియు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.( Shanmukh jashwanth Arrest)
ఓ కేసులో విచారణ కోసం పోలీసులు షణ్ముఖ్ నివాస స్థలానికి వెళితే, గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు.
షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంతలోనే మరో యువతితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై బాధితురాలు మోనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు వారి ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయి తో షణ్ముక్ జస్వంత్ పట్టుబడ్డడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
న్యూస్ పల్స్ తెలుగు,ఖమ్మం: తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని అదే పాఠశాలకు చెందిన లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు.( Teacher Harresed Students Brutally)
ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆ ఉపాధ్యాయుడుపై దాడి చేశారు. (News Pulse Telugu) సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు.
Tags:Newspulsetelugu, News, Teachers, Gurukul Schools, teacher Harresed Students